వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలక్షన్స్: పార్టీ టిక్కెట్ రాలేదని విషం తాగిన నేత, మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress leader drinks poison, dies after being denied ticket
భోపాల్: ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్ నిరాకరించిందనే కారణంతో కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకుడు ఆత్మహత్య చేసుకున్నారు! ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో మధ్య ప్రదేశ్ కూడా ఉంది.

నవంబర్ 25వ తేదీన జరిగే ఎన్నికలకు తనకు పార్టీ టిక్కెట్ నిరాకరించిందనే కారణంతో నర్సింగ్ మాల్వియా అనే నాయకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

నర్సింగ్ మాల్వియా అగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు. అతను ఈ రోజు ఉదయం విషం తాగాడు. అతనిని చికిత్స కోసం వెంటనే ఉజ్జయిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

వివరాల మేరకు.. నర్సింగ్ మాల్వియా జిల్లా పంచాయతీ మెంబర్. అతను రెండు దశాబ్దాలుగా కాంగ్రెసు పార్టీలో పని చేస్తున్నారు. గతంలో అతను ఎప్పుడు రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో పాల్గొనలేదు. అయితే ఈసారి తనకు టిక్కెట్ వస్తుందని ఆశించారు.

అగర్ నుండి పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్ ఇస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారట. అయితే టిక్కెట్ మరో వ్యక్తికి వచ్చింది. టిక్కెట్ రాకపోవడంతో అతను విషం తాగారట.

English summary
A Congress leader in Madhya Pradesh allegedly committed suicide today after being denied a ticket to contest the state polls on November 25.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X