వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్జల్‌గురు ఉరి అన్యాయం, నాడు బాధపడ్డా: కాంగ్రెస్ నేత, శివసేన ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అఫ్జల్ గురు ఉరి పైన మంగళవారం మరో వివాదం రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురు అస్తికలను వెనక్కి ఇవ్వాలన్న పీడీపీ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అంతేకాదు.. మరో సంచలన వ్యాఖ్య చేశారు.

అఫ్జల్ గురు ఉరితీత పైన ఆయన చింతించారు. పీడీపీ వ్యాఖ్యల పైన స్పందిస్తూ.. అఫ్జల్ గురును ఉరితీసినప్పుడు తాను తాను చాలా అప్ సెట్ అయ్యానని చెప్పారు. అతనిని ఉరి తీసేందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారం లేదని చెప్పారు. తన ఉద్దేశ్యం మేరకు న్యాయం జరగలేదన్నాడు. అఫ్జల్ గురు అస్తికలు ఇవ్వాలనే డిమాండును తాను సమర్థిస్తానని చెప్పాడు.

Congress leader Mani Shankar Aiyar supports PDP, advocates returning Afzal Guru's remains

శివసేన మండిపాటు

మణిశంకర్ అయ్యర్ పైన శివసేన ధ్వజమెత్తింది. శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. అతను ఇలాంటి ప్రకటనను ఇక్కడ కాదని, పాకిస్తాన్‌లో చేయాలని ఎద్దేవా చేశారు. అఫ్జల్ గురు యాంటీ నేషనల్ కాబట్టే అతనిని ఉరితీశారనే విషయం తెలుసుకోవాలన్నారు.

కాగా, పార్లమెంటు పైన దాడికి దిగిన అఫ్జల్ గురుకు చెందిన అస్తికలను వెనక్కి ఇవ్వాలని పీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే సోమవారం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. అఫ్జల్ గురును నాటి కేంద్ర ప్రభుత్వం 2013 ఫిబ్రవరి 9న ఉరి తీసింది.

English summary
Congress leader Mani Shankar Aiyar has subscribed PDP's demand that mortal remains of of Afzal Guru must be returned to his family. This has come to fore hours after Home Ministry rejected the demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X