వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్‌ను ఏకేసిన నగ్మా: ఆస్తులపై ట్విట్టర్‌లో ఉతికేసింది!..

ఓవైపు నోట్ల రద్దు పుణ్యమాని సామాన్యులు రోడ్డున పడితే.. లోకేష్ లాంటి సామాన్యులు మాత్రం అసామాన్యంగా మారారని నగ్మా ఆరోపించారు. నగ్మా చేసిన ఈ ట్వీట్ ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన చూపించిన ఆస్తుల లెక్క వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఐదు నెలల క్రితం ఆస్తులు ప్రకటించినప్పుడు ఆయన ఆస్తుల విలువ రూ.14.5కోట్లు కాగా, ఐదు నెలల వ్యవధిలోనే అసాధారణ రీతిలో వాటి విలువ రూ. 330కోట్లకు చేరుకోవడం గమనార్హం.

దీనిపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేయగా.. ఆస్తులన్ని సక్రమమే అని మీడియా ముందుకు వచ్చి లోకేష్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే లోకేష్ ఆస్తుల వివాదం జాతీయ స్థాయిలోను అందరి దృష్టిని ఆకర్షించింది. హిందూస్తాన్ టైమ్స్ లాంటి పత్రికలు సైతం లోకేష్ ఆస్తులపై విస్మయం వ్యక్తం చేశాయి.

<strong>కావాలనే దుష్ప్రచారం, సాక్షిని చదవొద్దు, ఆస్తులన్నీ సక్రమమే: లోకేష్</strong>కావాలనే దుష్ప్రచారం, సాక్షిని చదవొద్దు, ఆస్తులన్నీ సక్రమమే: లోకేష్

tweet:

ఇదే క్రమంలో ఒకప్పటి సినీ నటి, ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు నగ్మా సైతం లోకేష్ ఆస్తులపై స్పందించారు. ట్విట్టర్ ద్వారా దీనిపై స్పందించిన నగ్మా.. ఇది ఎన్డీయే పాలనకు అద్దం పడుతుందంటూ ట్వీట్ చేశారు. ఓవైపు నోట్ల రద్దు పుణ్యమాని సామాన్యులు రోడ్డున పడితే.. లోకేష్ లాంటి సామాన్యులు మాత్రం అసామాన్యంగా మారారని నగ్మా ఆరోపించారు. నగ్మా చేసిన ఈ ట్వీట్ ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవడమే గాక, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని, కొన్ని స్టార్టప్ సంస్థలు సైతం మూతపడ్డాయని, 125మంది సామాన్యులు చనిపోయారని నగ్మా గుర్తుచేశారు.

English summary
Congress leader Nagma was responded on the controversy of TDP leader Nara Lokesh's assets. She just criticized him by mentioning NDA govt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X