వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎదిరిస్తే కేసులే.. దేశంలో మోడీ నియంత పాలన..

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్రమోడీ కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఆయనపై ఎవరు విమర్శలు చేసిన కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే మూక దాడులకు సంబంధించి ప్రధానికి లేఖ రాసిన 50 మంది సెలబ్రెటిలపై రాజద్రోహం కేసు పెట్టారని అన్నారు.ఈ విధంగా ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వివిధ రకాలుగా దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

మరోవైపు దేశంలో నియంత పాలన కొనసాగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ముస్లింలు, దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని దేశంలోని పలువురు ప్రముఖులు మోదీకి బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. వారిలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, దర్శకుడు మణిరత్నం, అపర్ణ సేన్‌, అనురాగ్ కశ్యప్, శ్యామ్ బెనెగల్, సౌమిత్రా ఛటర్జీ, గాయకుడు శుభా ముద్గల్ తదితరులు ఉన్నారు. జై శ్రీరాం నినాదాన్ని రెచ్చగొట్టే విధంగా వాడుకున్నారంటూ పలువురు ప్రముఖులు లేఖలో అభిప్రాయపడ్డారు. వీళ్లందరిపై గురువారం బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

Congress leader Rahul Gandhi lashed out at the BJP government

దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పిన ఆయన ఈ అంశాలను మీడియా కూడ స్వతంత్ర్యంగా వ్యవహరించి బయటకు తీసుకురావడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే బండీపూర్‌ టైగర్‌ రిజర్వ్‌లో రాత్రివేళ ట్రాఫిక్‌ను నిషేదించడాన్ని ఖండించారు. అందుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతు తెలిపారు.

English summary
Congress leader Rahul Gandhi lashed out at the BJP government saying anybody who says anything against Narendra Modi is put behind bars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X