వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శనివారం రాహుల్ గాంధీతోపాటు జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్న ప్రతిపక్ష పార్టీల నేతలు

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతోపాటు రాష్ట్ర విభజన చేసిన తర్వాత మొదటిసారీ కశ్మీర్‌లో పర్యటించేందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పది ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి శనివారం కశ్మీర్ వెళ్లనున్నారు. అయితే కశ్మీర్‌లో ప్రత్యేక పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే పలువురు స్థానిక నేతలనే గృహ నిర్భంధం చేసిన పరిస్థితి. దీంతో ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నాయకులను, పార్టీ నేతలను అనుమతించలేదు.కశ్మీర్‌లో పర్యటించే వారిలో రాహుల్‌తో పాటు, అజాద్,కేసీ వేణుగోపాల్, డీ.రాజా, సీతారాం ఏచూరీ తోపాటు ఆర్జేడీ,టీఎంసీ,ఎన్సీపీ నేతలు ఉన్నారు.

కశ్మీర్‌లో ప్రతిపక్ష పార్టీల పర్యటన

కశ్మీర్‌లో ప్రతిపక్ష పార్టీల పర్యటన

శనివారం జమ్ము కశ్మీర్‌లో 10 ప్రతిపక్ష పార్టీల నేతలు పర్యటించనున్నారు. కాగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత కశ్మీర్ పార్టీ నేతలైన మాజీ ముఖ్యమంత్రులు, ఫరూక్ అబ్దూల్లా, ఒమర్ అబ్దుల్లాతో పాటు మహబుబా ముఫ్తి, లను గృహ నిర్భంధలో ఉంచారు. దీంతో పాటు ఉద్రిక్తలను ప్రభావితం చేస్తారనుకునే వందలాది మందిని ఇళ్లు దాటకుండా భద్రతా దళాలు కట్టడి చేశాయి. దీంతో పాటు కనీసం శ్రీనగర్‌కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేత గులాంనబి అజాద్‌ను సైతం శ్రీనగర్ పట్టణంలోకి ప్రవేశించకుండా ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. దీంతో ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఇలా రెండు సార్లు ఆయన స్వంత రాష్ట్రానికి వెళ్లకుండా కేంద్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఆయనతోపాటు సీపిఎం జాతీయ కార్యదర్శి, సీతారం ఏచూరీ, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ. రాజాలను సైతం శ్రీనగర్ ఎయిర్ పోర్టులోనే పట్టణలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.

సత్యపాల్‌ మాలిక్ ,రాహుల్ మధ్య మాటల యుద్దం,

సత్యపాల్‌ మాలిక్ ,రాహుల్ మధ్య మాటల యుద్దం,

కాగా అంతకు ముందు రాహుల్ గాంధీ, గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య మాటల యుద్దం కొనసాగింది. కశ్మీర్‌లో హింస చెలరేగుతుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే రాహుల్ గాంధీకి ఆయన సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి నేనే ఓ హెలికాప్టర్ పంపిస్తాను. వచ్చి గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి పరిశీలించమని అన్నారు. అయితే రాహుల్ గాంధీ కూడ అందుకు స్పందిచారు. హెలికాప్టర్ అవసరం లేదు. కనీసం స్వేఛ్చ ప్రజల్లోకి వెళ్లనిస్తే చాలని ఆయన కోరారు. దీంతో రెండు మూడు రోజులు కశ్మీర్ అంశంపై పలు ఆందోళనలు,ఆరోపణలు చెలరేగాయి.

ఇప్పుడైన నేతలను అనుమతిస్తారా...?

ఇప్పుడైన నేతలను అనుమతిస్తారా...?

కాగా తాజాగా అక్కడ సాధరణ జనజీవనం కొనాసాగుతోంది, దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలతోపాటు ,ఇంటర్‌నెట్ సేవలు, కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్దరించారు. దీంతో గత సోమవారం క్రమంగా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను సైతం తొలగించారు. దీంతో అక్కడ ఇప్పుడిప్పుడే సాధరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఇలాంటీ సమయంలో ప్రతిపక్ష నేతలను పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు పార్టీల నేతలను ఇప్పుడు కూడ అనుమతించకపోతే రాజకీయంగా దుమారం రేపే అవకాశాలు కూడ కనిపిస్తున్నాయి.

English summary
Congress leader Rahul Gandhi will visit Srinagar on Saturday along with a delegation of 10 opposition parties.ofter Centre removed the special status to Jammu and Kashmir under Article 370,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X