బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెడ్డి కులానికి అన్యాయం చేశారు, మంత్రి పదవి లేదు, 9 మంది ఎమ్మెల్యేలు, రామలింగా రెడ్డి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రెడ్డి వర్గం (కులం) బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదని, వారికి అన్యాయం చేశారని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బెంగళూరులోని బీటీఎం లేఔట్ నియోజక వర్గం ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో 9 మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారని గుర్తు చేశారు.

కర్ణాటకలోని బాగల్ కోటేలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి మాట్లాడారు. బీజేపీలో 9 మంది రెడ్డి కులానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని రామలింగా రెడ్డి అన్నారు. ఆ 9 మందిలో ఒక్క ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీకి మనసు రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Congress leader Ramalinga Reddy said BJP neglecting Reddy community by not giving minister post

రాజకీయ పార్టీలు అన్ని కులాలను ఒకేలాగా చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. అయితే బీజేపీ ఆ విషయంలో తారతమ్యం చూపించిందని, రెడ్డి కులానికి అన్యాయం చేసిందని మాజీ మంత్రి రామలింగా రెడ్డి ఆరోపించారు.

మరో మంత్రివర్గ విస్తరణలో రెడ్డి కులం ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం ఇస్తారా ? లేదా ? అని వేచి చూస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలిగా రెడ్డి మాట్లాడారు. రాజకీయాలు కాలచక్రంలా తిరుగుతాయని రామలింగా రెడ్డి చెప్పారు.

రాజకీయాల్లో కిందకు వస్తామని, తరువాత పైకి వస్తామని మాజీ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యల పరస్పర ఆరోపణలు గురించి రామలింగా రెడ్డి మాట్లాడారు. వానలు పడి నిలిచిపోయిన తరువాత గాలులు వస్తాయని, ఇది అలాంటిదే అని రామలింగా రెడ్డి అన్నారు. కాంగ్రెస్=జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు.

English summary
Karnataka Congress leader, MLA Ramalinga Reddy said BJP neglecting Reddy community by not giving minister post to any Reddy MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X