బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిగ్గు..సిగ్గు, ఇక మీకు హక్కులేదు: నటి రమ్య, ప్రకాశ్ రాజ్‌లపై నెటిజన్ల ఫైర్, దిమ్మతిరిగేలా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్, ప్రముఖ నటి రమ్య ఓటు వేయలేదని తెలుస్తోంది. ఈ కారణంగా సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

'రమ్య అలియాస్ దివ్య స్పందన గారు మీరు ఏం రాజకీయ నాయకులు? ఓటు వేయనందుకు మీకు అవమానంగా అనిపించడం లేదా, అనవసర ఆరోపణలు ఆపివేయండి. మొదట ఓ భారత పౌరురాలుగా మీ బాధ్యతలు తెలుసుకోండి' అని ప్రశాంత్ కుమార్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.

రమ్యకు ప్రభుత్వంపై విమర్శించే హక్కు లేదు

రమ్యకు ప్రభుత్వంపై విమర్శించే హక్కు లేదు

ఎవరైతే ప్రధాని మార్క్స్ కార్డ్ గురించి మాట్లాడారో, వారే ఓటు వేయడం మరిచిపోయారని మంజునాథ్ హిరనే అనే నెటిజన్ కామెంట్ చేశారు. రమ్య తన ఓటు హక్కును ఉపయోగించుకోలేదని కాబట్టి ఆమెకు తదుపరి ప్రభుత్వంపై మాట్లాడే హక్కు కూడా లేదని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.

ప్రకాశ్ రాజ్, రమ్యల తీరు షేమ్ షేమ్

ప్రకాశ్ రాజ్, రమ్యల తీరు షేమ్ షేమ్

రమ్య మొదట బాధ్యత గల పౌరురాలిగా వ్యవహరించి, ఆ తర్వాత ఇతరులపై విమర్శలు చేయాలని మరో నెటిజన్ మండిపడ్డారు. రమ్యతో పాటు ప్రకాశ్ రాజ్ కూడా ఓటు వేయలేదని వచ్చిన ఓ వార్తను ప్రసన్న అనే వ్యక్తి పోస్టు చేసి.. వీరు ఫేక్ ఇండియన్ సిటిజన్స్ అని మండిపడ్డారు. వీరికి కనీసం ఓటు వేయాలనే చిన్న బాధ్యత కూడా తెలియదన్నారు. రమ్య, ప్రకాశ్ రాజ్‌ల తీరు షేమ్‌లెస్‌గా ఉందన్నారు.

రమ్య చెప్పారు కానీ ఓటేయలేదు

రమ్య చెప్పారు కానీ ఓటేయలేదు

మాండ్యలో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదయిందని, కానీ రమ్య ఓటు వేయలేదని మరో నెటిజన్ పేర్కొన్నారు. రమ్య ఫేక్ అకౌంటుతో ఓటు వేయడం లేదా పప్పుతో కలిసి హిమాలయాలకు వెళ్లడం చేసి ఉంటారని మరో నెటిజన్ సెటైర్ వేశారు. కర్నాటక ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చిన రమ్యనే ఓటువేయలేదని మరొకరు విమర్శించారు.

రమ్య ఎందుకు ఓటేయలేదు?

రమ్య ఎందుకు ఓటేయలేదు?

నీతులు చెప్పిన 420 రమ్య, 840 ప్రకాశ్ రాజ్‌లు ఓటు వేయలేదని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయవద్దు అని మాకేదో నీతులు చెప్పి ఇప్పుడు వారు ఓటు వేయకుండా ఉండిపోయారని, వావ్ అని మరొకరు ట్వీట్ చేశారు. బాధ్యత లేకుండా వ్యవహరించే మీకు ఓటు వేయమని చెప్పే హక్కు ఎక్కడిదని మరొకరు పేర్కొన్నారు.

ప్రకాశ్ రాజ్‌కు ఓ నెటిజన్ కౌంటర్

ప్రకాశ్ రాజ్‌కు ఓ నెటిజన్ కౌంటర్

ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. మీరు చెప్పినట్లు అభివృద్ధికి ఓటు వేశాను (బీజేపీకి ఓటు) మరి మీరు వేశారా అని ప్రశ్నించారు. రెండు రోజుల ముందు ప్రకాశ్ రాజ్ అభివృద్ధికి ఓటు వేయమని ట్వీట్ చేశారు.

English summary
Kannada Actress, Congress Politician, INC's Social Media Head Ramya aka Divya Spandana gets trolled on Social Media for not voting in Karnataka Assembly Elections 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X