• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నా హిందూ భార్యపై చేయివేశా, ఏం చేసుకుంటావో చేసుకో: కేంద్రమంత్రికి ఫోటో పెట్టి సవాల్

|

బెంగళూరు/న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో చేసిన ఓ కామెంట్‌ను సమర్థించుకునే క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ నేత దినేష్ గుండూరావ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో హెగ్డే పైన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించలేదని, అది ఓఆలయం అని అంతకుముందు చెప్పారు.

అనంత్ కుమార్ వివాదం

అనంత్ కుమార్ వివాదం

ఆ తర్వాత సోమవారం కర్ణాటకలోని కొడుగు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. హిందూ మహిళలను ఎవరి చెయ్యి అయినా తాకితే అది ఇక ఉండకూడదని వ్యాఖ్యానించారు. గుండూరావ్ బ్రాహ్ణుడు. ఆయన టబు అనే ముస్లీం మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత గుండూరావ్ స్పందిస్తూ.. మీరు కేంద్రమంత్రి ఇందుకే అయ్యారా అని ప్రశ్నించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఏం చేశారని ప్రశ్నించారు. ఓ కేంద్రమంత్రిగా ఇలాంటి మాటలా అన్నారు.

గుండూరావ్ భార్యను లాగిన హెగ్డే

దీనిపై హెగ్డే స్పందిస్తూ.. తాను దినేష్ గుండూరావ్ ప్రశ్నలకు తప్పకుండా సమాధానం ఇస్తానని, కానీ ముందుగా గుండూరావ్ ఎవరితో కలిసి ఏం విజయాలు సాధించారో చెప్పాలని, తనకు తెలిసినంత వరకు ఆయన ఓ ముస్లిం మహిళ వెనుక పరుగెత్తిన వ్యక్తి మాత్రమే అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేంద్రమంత్రిగా అనంత్ కుమార్ అనర్హుడని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ కూడా విమర్శలు గుప్పించారు. అనంత్ కుమార్ స్కిల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ అని, దానిని నిర్వర్తించాలని, కానీ ప్రజలకు మాత్రం చేతులు నరికేయండి, చంపండి అని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

గుండూరావ్ భార్య టబు స్పందన

అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై గుండూరావ్ సతీమణి టబూ రావు కూడా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తనను, తన కుటుంబాన్ని అవమానించేలా ఉన్నాయని టబురావు పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ తాను అతనిని ట్యాగ్ చేయలేకపోతున్నానని, ఎందుకంటే అతను తన అకౌంట్‌ను బ్లాక్ చేశాడని పేర్కొన్నారు. తనను ఇందులోకి లాగడం సరికాదని చెప్పారు.

ఫోటో షేర్ చేసి సవాల్ విసిరిన తెహ్సీన్

ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ హోస్ట్, తెహ్సీన్ పూనావాలా.. కేంద్రమంత్రి హేగ్డేకు సవాల్ విసిరారు. 'గుడ్ ఆఫ్టర్‌నూన్.. అనంత్ కుమార్, నా చేతులు నా హిందూ భార్య పైన ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో. ఇది నా సవాల్' అని ట్వీట్ చేశారు. తన భార్యపై తాను చేయి వేస్తూ ఫోటో దిగి పోస్ట్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When Tehseen Poonawalla wished Union Minister Anant Kumar Hegde a good afternoon on Monday, there was more to the tale than just a friendly greeting between netas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more