వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ పేరు మీద హంపీలోని జూలో తెల్ల పులిని దత్తత తీసుకున్న కాంగ్రెస్ నేతలు , 51 వ బర్త్ డే స్పెషల్ !

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 51 వ పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలోని విజయనగర జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బృందం అర్జున అనే తెల్ల పులిని హంపిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి జూలాజికల్ పార్క్‌లో ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. రాహుల్ గాంధీ పేరు మీద ఈ తెల్ల పులిని దత్తత తీసుకున్నారు.

రాహుల్ బర్త్ డే సందర్భంగా బళ్ళారి మరియు విజయనగర గ్రామీణ యువజన కాంగ్రెస్ నేతలు నిర్ణయం

రాహుల్ బర్త్ డే సందర్భంగా బళ్ళారి మరియు విజయనగర గ్రామీణ యువజన కాంగ్రెస్ నేతలు నిర్ణయం

బళ్ళారి మరియు విజయనగర గ్రామీణ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు సిద్దూ హల్లెగౌడ మరియు అతని స్నేహితులు జూన్ 19 న దత్తత తీసుకోవడానికి కర్ణాటక జూ అథారిటీకి రూ .1 లక్ష మొత్తాన్ని జమ చేశారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా తాము కొన్ని సామాజిక కార్యక్రమాలను చేయాలనుకుంటున్న క్రమంలో , జంతుప్రదర్శనశాలలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నందున కాంగ్రెస్ నాయకుడైన రాహుల్ గాంధీ పేరు మీద పులిని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని హల్లెగౌడ పేర్కొన్నారు.

అర్జున అనే తెల్ల పులిని దత్తత తీసుకున్న కాంగ్రెస్ నాయకులు

అర్జున అనే తెల్ల పులిని దత్తత తీసుకున్న కాంగ్రెస్ నాయకులు

జూ అధికారుల ప్రకారం, దత్తత ప్రక్రియ సాధారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది .ఈ ప్రక్రియలోత్వరగానే ధృవీకరణ పత్రం ఇవ్వబడుతుంది. కాంగ్రెస్ నాయకులు జంతుప్రదర్శనశాలను సందర్శించి, వారు దత్తత తీసుకున్న పులిని చూడాలని కోరుకున్నందున, వారి సందర్శనకు అనుమతి ఇవ్వబడింది అని జూ అధికారి ఒకరు తెలిపారు.ఇటీవల, కర్ణాటక అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్ అయిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీపా, జంతుప్రదర్శనశాలలను నిర్వహించడానికి సహాయపడటానికి జూలోని జంతువులను దత్తత తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జూలో జంతువులను దత్తత తీసుకోవాలని కన్నడ నటుడి విజ్ఞప్తి

జూలో జంతువులను దత్తత తీసుకోవాలని కన్నడ నటుడి విజ్ఞప్తి

కర్ణాటకలో జంతుప్రదర్శనశాలలలోని జంతువులను దత్తత తీసుకోవాలని నటుడు ప్రజలను విజ్ఞప్తి చేసిన తరువాత గత రోజులుగా చాలామంది జంతు ప్రేమికులు మరియు సంస్థల నుండి రూ కోటి రూపాయలకు పైగా దత్తత కార్యక్రమానికి జూ కు అందించారు. దత్తత తీసుకున్న వారిలో ఎక్కువ మంది బెంగళూరులోని మైసూరు మరియు బన్నర్‌ఘట్ట ప్రాంతాలనుండి వచ్చిన వారని కర్ణాటక జూ అథారిటీ అధికారులు తెలిపారు.

రాహుల్ గాంధీ పేరు మీద ఈ ఏడాది అర్జున తెల్ల పులి సంరక్షణ ఖర్చు అంతా వారిదే

రాహుల్ గాంధీ పేరు మీద ఈ ఏడాది అర్జున తెల్ల పులి సంరక్షణ ఖర్చు అంతా వారిదే

భారత టైగర్ సంరక్షణ కార్యక్రమం అయిన ప్రాజెక్ట్ టైగర్ ను 1973 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో ప్రారంభించింది. అప్పటినుండి పులుల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా, వాటి సంరక్షణ కోసం దత్తత కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నారు.ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ పేరు మీద ఒక తెల్ల పులిని దత్తత తీసుకుని ఈ ఏడాది దాని సంరక్షణకు అయ్యే ఖర్చు అంతా వారే భరించనున్నారు.

English summary
A white tiger named Arjuna at the Atal Bihari Vajpayee Zoological Park in Hampi has been adopted in the name of Rahul Gandhi for a period of one year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X