వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ చీఫ్‌ ఎంపికలో ట్విస్ట్...! నిర్ణయం తీసుకునేందుకు సభ్యులకు సమయం ఇచ్చిన సోనియా, రాహుల్‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాంగ్రెస్‌ చీఫ్‌ ఎంపికలో ట్విస్ట్ || Congress Leaders Held A Meeting With Senior Party Leaders

న్యూఢిల్లీ/హైదరాబాద్ : కాంగ్రెస్ అదిష్టానం ఏఐసీసీ అద్యక్షుడి ఎంపికలో కీలక అడుగు వేస్తోంది. ఢిల్లీ లో భేటీ ఐన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు అద్యక్షుడి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఐదు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు అద్యక్షుడి అంశంలో తుది కసరత్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎలాంటి వ్యతిరేకతలు వస్తాయి, అందరికి ఆమోదయోగ్యమైన అభ్యవర్థిని ప్రతిపాదించడం, కాంగ్రెస్ పార్టీ పూర్వ వూభవం దిశగా అడుగువేయించగల సత్తా, సామర్థ్యం ఉన్న నేత ఎంపిక తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని లోతైన చర్చలు జరుపుతున్నారు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు.

కొత్త అధ్యక్షుడి ఎన్నికకు ఐదు గ్రూపులు..! లోతుగా చర్చిస్తున్న సభ్యులు..!!

కొత్త అధ్యక్షుడి ఎన్నికకు ఐదు గ్రూపులు..! లోతుగా చర్చిస్తున్న సభ్యులు..!!

ఇదిలా ఉండగా ఉదయం జరిగిన కీలక సమావేశంలో సభ్యుల నుండి ఎలాంటి నిర్ధిష్ట నిర్ణయం వెలువడక పోవడంతో కోర్ కమిటీకి మరికొంత సమయం ఇచ్చారు సోనియా గాంధీ. లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారికి సోనియా సూచించినట్టు తెలుస్తోంది. సీడబ్య్లూసీ సమావేశంలో కొంత మంది నేతలు మళ్లీ ప్రియాంక గాంధీ పేరును సూచించడంతో సమావేశంలోని సభ్యులు పునరాలోచలో పడ్డట్టు తెలుస్తోంది. గాంధీ కుటుంబం నుండి ఏ ఒక్కరి పేరును పరిగణలోకి తీసుకోవద్దని సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ మరోసారి సభ్యులకు వినమ్రంగా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. సభ్యులందరూ సాయంత్రంలోపు తమ అభిప్రాయాలను చెప్పాల్సిందిగా సోనియా, రాహుల్ ప్రతిపాదించి సమావేశం నుండి వెళ్లి పోయినట్టు సమాచారం.

సీడబ్ల్యూసీ భేటీ నుంచి బయటకొచ్చిన సోనియా, రాహుల్‌..! సాయంత్రం మరోసారి భేటీ..!!

సీడబ్ల్యూసీ భేటీ నుంచి బయటకొచ్చిన సోనియా, రాహుల్‌..! సాయంత్రం మరోసారి భేటీ..!!

కాంగ్రెస్‌ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. నేడు సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో రాష్ట్రాల నేతలతో పార్టీ అధిష్టానం విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలతో పార్టీ పెద్దలు చర్చిస్తున్నారు. పార్టీ నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే ఏఐసీసీ అధ్యక్షుడిని ఎంపికపై ఓ అభిప్రాయానికి రావాలని రాహుల్‌ గాంధీ నిర్దేశించారు. నూతన అధ్యక్షుడి ఎన్నికలో తాము భాగస్వామ్యం కాబోమని సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తేల్చి చెప్పారు. దీంతో సమావేశం మధ్యలోనే వారద్దరూ బయటకు వెళ్లిపోయారు. దీంతో పార్టీ పీసీసీలే కొత్త చీఫ్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.

చారిత్రక నిర్ణయం..! కొత్త సారధి ఎంపికలో పొరపాట్లు వద్దన్న సోనియా..!!

చారిత్రక నిర్ణయం..! కొత్త సారధి ఎంపికలో పొరపాట్లు వద్దన్న సోనియా..!!

మరోవైపు ఈసారి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, ముఖ్యనేతలను ఐదు గ్రూపులుగా విభజించి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల నేతలతో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సంప్రదింపులు జరపనున్నారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల నేతలతో ప్రియాంక గాంధీ, పశ్చిమ రాష్ట్రాల నేతలతో రాహుల్‌ గాంధీ, తూర్పు రాష్ట్రాలతో సోనియాగాంధీ, ఈశాన్య రాష్ట్రాల నేతలతో అంబికా సోని సంప్రదింపులు జరిపి ఓ అభిప్రాయానికి రానున్నారు. కేవలం సీడబ్ల్యూసీ నేతలతోనే కాకుండా రాష్ట్ర నేతలతో కూడా సంప్రదింపులు జరిపి కొత్త అధ్యక్షుడి ఎంపిక చేయాలన్న రాహుల్ గాంధీ సూచన మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. దీంతో కొత్త అధ్యక్షుడుని ఎన్నికకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

పూర్తి స్థాయిలో అద్యక్షుడు..! పోటీలో నలుగురి పేర్లు..!!

పూర్తి స్థాయిలో అద్యక్షుడు..! పోటీలో నలుగురి పేర్లు..!!

తొలుత తాత్కాలిక ప్రాతిపదికన అధ్యక్షుడిని ఎన్నుకుని, ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధ్యక్ష పదవికి అంతర్గత ఎన్నికలు నిర్వహించేందుకు కొందరు సీనియర్లు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సారథి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నూతన సారథి రేసులో ఇద్దరి పేర్లే వినబడుతున్నాయి. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా పనిచేసిన ఖర్గే కాగా, మరొకరు ముకుల్‌ వాస్నిక్‌. మరోవైపు పార్టీ యువ నేతలు జ్యోతిరాధిత్య సింధియా, సచిన్‌ ఫైలెట్లు కూడా రేసులో ఉన్నారు.

English summary
The Congress party is going through a serious exercise on the selection of the new national president. The Congress Working Committee (CWG) meeting today is holding a wide-ranging consultation of the party's high command with the states leaders. Party elders are discussing with all State PCC presidents and SCP leaders. Rahul Gandhi directed to come to an opinion on the selection of the AICC president only after taking the views of all the party heads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X