వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ పోటీ చేయం: మాయావతి, అఖిలేష్ ఫ్యామిలీతో పాటు 7 స్థానాలు వదిలేసిన కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

లక్నో: కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ వేరుగా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేసే అమేథి, రాయ్‌బరేలీలలో ఎస్పీ, బీఎస్పీలు ఎవరినీ పోటీలో నిలబెట్టవద్దని నిర్ణయించాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు స్థానాల్లో ఎవరినీ పోటీలో నిలబెట్టకుండా, ఎస్పీ, బీఎస్పీకి మద్దతివ్వాలని నిర్ణయించాయి.

యూపీలో మొత్తం 80 లోకసభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధినేత కుటుంబం రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది. రాహుల్, సోనియాలు పోటీ చేసే చోట ఎవరినీ నిలబెట్టమని ఎస్పీ, బీఎస్పీ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కూడా అదే పంథాను కొనసాగించింది.

Congress leaves 7 seats for Mayawati, Akhilesh alliance in UP

ఏడు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని కాంగ్రెస్‌ ఆదివారం ప్రకటించింది. వాటిని ఎస్పీ, బీఎస్పీ కూటమికే వదిలేస్తున్నామని తెలిపారు. ములాయం సింగ్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న మెయిన్‌పురి, ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేయనున్న కనౌజ్, మాయావతి పోటీ చేసే స్థానం, రాష్ట్రీయ లోక్ దళ్‌ నేత అజిత్‌ సింగ్‌, జయంత్‌ చౌదరి పోటీ చేసే స్థానాలతో పాటు మరో రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ బరిలోకి దిగదని కాంగ్రెస్‌ నేత రాజ్‌ బబ్బర్‌ తెలిపారు.

ఎస్పీ, బీఎస్పీ కూటమి ఏర్పడటంతో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని కాంగ్రెస్ తెలిపింది.అమేథి, రాయ్‌బరేలీ స్థానాలను వదిలేసి మిగిలిన 78 స్థానాల్లో కూటమి పోటీ చేయనున్నట్లు బీఎస్పీ-ఎస్పీ కూటమి తెలిపింది. తమ యూపీ కూటమిలో కాంగ్రెస్‌ కూడా భాగమేనంటూ అఖిలేష్‌ చెప్పారు. దీంతో అమేథీ, రాయ్‌బరేలీలో పోటీ చేయబోయేదన్నారు.

English summary
Among the seats that the Congress will not be contesting on are Mainpuri, Kannauj and the seats from where BSP chief Mayawati and RLD leaders Ajit Singh and Jayant Chaudhary will contest the upcoming Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X