వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే జరిగితే కాంగ్రెస్ గోవిందా: 1985 సీన్ రిపీట్ అయితే, బీజేపీ కథ?

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: భారతదేశంలో హిందూ ప్రయోగశాల అనే పేరు ఉన్న గుజరాత్ లో కాంగ్రెస్ విజయం సాధించింది 1985లో మాత్రమే. తరువాత గుజరాత్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ వెనక్కి తిరిగి చూడకుండా భారీ విజయాలు సొంతం చేసుకుంది. ఇప్పుడు గుజరాత్ లో బీజేపీ విజయం సాధిస్తే కాంగ్రెస్ ముచ్చటగా ఆరోసారి ఓటమి రుచిచూడ నుంది.

Recommended Video

Gujarat election results : మోడీ కళ్లు తెరవాల్సిన సమయం వచ్చింది
ఆరో సారి బీజేపీ !

ఆరో సారి బీజేపీ !

2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కౌంటిగ్ జరుగుతున్న సందర్బంగా కాంగ్రెస్ నాయకుల టెన్షన్ తో సతమతం అవుతున్నారు. ఎప్పటిలాగే 2017 శాసన సభ ఎన్నికల్లో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని బీజేపీ నాయకులు ధీమాతో ఉన్నారు.

ఆలయాల్లో ఆశీర్వాదం

ఆలయాల్లో ఆశీర్వాదం

గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ గుజరాత్ లోని ప్రముఖ ఆలయాలు సందర్శించి దేవుడి ఆశీర్వాదం తీసుకున్నారు. కచ్చితంగా ఈ సారి శాసన సభ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ దీమాగా ఉన్నారు.

అదే జరిగితే ?

అదే జరిగితే ?

గుజరాత్ ఎన్నికల ఎగ్జిట్ ఫోల్స్ పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ప్రతిపక్షానికే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జీట్ పోల్స్ మొత్తం బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి. ఓటరు దేవుళ్లు ఎవరిని ఆశీర్వదిస్తారో అనే విషయం అంతు చిక్కడం లేదు.

 నువ్వా నేనా !

నువ్వా నేనా !

గుజరాత్ లోని 93 శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గుజరాత్ లో 93 శాసన సభ నియోజక వర్గాలు బీజేపీకి కంచుకోటగా ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నియోజక వర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నువ్వూ నేనా అంటూ పోడీ పడుతున్నాయి.

ఉల్టా పల్టా అయితే ?

ఉల్టా పల్టా అయితే ?

గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్బంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే బీజేపీ నాయకులు కచ్చితంగా షాక్ కు గురి కావాల్సిందే. బీజేపీని ఓడించడానికి రాహుల్ గాంధీతో పాటు పాటీదార్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు తీవ్రస్థాయిలోనే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్బంలో గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఉల్టాపల్టా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 ఆ ముగ్గురు ?

ఆ ముగ్గురు ?

గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హార్థిక్ పటేల్, అల్ఫేష్ ఠాకూర్, జిగ్నష్ మేవాని మొదటి నుంచి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అల్పేష్ యాదవ్, జిగ్నేష్ మేనాని బీజేపీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యలేకపోయారు. అయితే హార్దిక్ పటేల్ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ మీద బహిరంగంగానే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

నాలుగు సార్లు మోడీ !

నాలుగు సార్లు మోడీ !

గుజరాత్ లో గత నాలుగు సార్లు జరిగిన శాసన సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభావం ఎక్కువగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ మొత్తం తిరిగి ఎన్నికల ప్రచారం చేసి బీజేపీ గెలిపించాలని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ శక్తి వంచన లేకుండా ప్రచారం చేశారు.

 చావు దెబ్బ తింటే ?

చావు దెబ్బ తింటే ?

గుజరాత్ లో బీజేపీ విజయం సాధించి కాంగ్రెస్ చావు దెబ్బ తింటే కచ్చితంగా వచ్చే సంవత్సరం ఆ పార్టీ సవాలు ఎదుర్కోవాలసి వస్తుంది. ఎందుకంటే 2018లో కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సందర్బంలో బీజేపీ తన ఆధిపథ్యాన్ని చూపించే అవకాశం ఉంది.

English summary
Congress has not won the assembly election in Gujarat for the past 22 years. Last time it won in 1985. After that BJP has won 5 times continuously. During Gujarat Assembly Elections 2017 the equations have changed. Any party can win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X