వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు కలిసిరాని 2019, రాహుల్‌కు చేదు అనుభవాలు.. పార్టీ పగ్గాలకు దూరంగా యువరాజు

|
Google Oneindia TeluguNews

2019 కాంగ్రెస్ పార్టీకి ఏం మిగిల్చింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన.. సాధారణ ఎన్నికల్లో ఎందుకు ప్రభావం చూపలేకపోయింది. రాఫెల్ ఒప్పందం స్కాంపై విమర్శలు, న్యాయ్ పథకాలు, హిందుత్వకు అనుకూలంగా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నప్పటికీ ఆ పార్టీని ప్రజలు ఎందుకు విశ్వసించలేదు. వన్ ఇండియా ప్రత్యేక కథనం.

3 రాష్ట్రాల్లో హవా..

3 రాష్ట్రాల్లో హవా..

2014లో మోడీ-అమిత్ షా ద్వయం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసి, ముందుకుసాగింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మూడురాష్ట్రాల్లో అధికారం చేపట్టింది. ఇది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి బూస్ట్ ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై రాహుల్ గాంధీ గళమెత్తారు. రాఫెల్ ఒప్పందంలో జరిగిన అవకతవకల గురించి ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ గురించి ప్రస్తావిస్తూ విమర్శించారు. హిందూత్వకు అనుకూలంగా అడుగులు కూడా వేశారు. న్యాయ్ పథకంతో చేపట్టే పనులు, ప్రజల జీవన ప్రమాణాల గురించి స్పష్టంగా తెలియజేశారు.

విశ్వసించని ప్రజలు

విశ్వసించని ప్రజలు

కానీ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని మాత్రం ప్రజలు విశ్వసించలేదు. మరోసారి మోడీకి పట్టం కట్టారు. గాంధీ-నెహ్రూ కంచుకోట అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవీ నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. గాంధీ-నెహ్రూ వారసుల్లో పార్టీ అధ్యక్షులుగా రాహుల్ తప్పుకోవడం ఇదే తొలిసారి. దీనిని బీజేపీ తమ అస్త్రంగా మలచుకొని విమర్శలు చేసింది.

శివాలయంలో పూజలు

శివాలయంలో పూజలు

దేశానికి కాపలా ఉంటానని చెప్పిన మోడీ దొంగ అయ్యారని..చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికలకు ముందు కనీస ఉమ్మడి ప్రణాళికలో భాగంగా న్యాయ్ పథకం కూడా ప్రకటించే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు శివాలయానికి వెళ్లి పూజలు కూడా చేశారు రాహుల్ గాంధీ.

పెరిగిన మెజార్టీ

పెరిగిన మెజార్టీ

మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు రాహుల్ గాంధీ అస్త్రశస్త్రాలు ప్రయోగించారు. కానీ ప్రజలు మాత్రం విశ్వసించలేకపోయారు. దీంతో 2014 కన్నా ఎక్కువ సీట్లే కట్టాబెట్టారు. బీజేపీ అనుకూల గాలిలో రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి ఓడిపోయారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో సోనియాగాంధీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు రాహుల్ గాంధీ. కొద్దిరోజులు విదేశాలకు వెళ్లిపోయారు. ఆ సమయంలో ట్వీట్టర్‌లో కూడా అందుబాటులో లేరు. వరసగా ట్వీట్లు చేసే రాహుల్... సోషల్ మీడియాకు ఇనాక్టివ్ అయిపోయారు.

దూరం..దగ్గరగా..?

దూరం..దగ్గరగా..?

తర్వాత రాహుల్ గాంధీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీకి ఎప్పుడూ దూరంగా ఉంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన వారసుడు దూరంగా ఉండటం సాధ్యమవుతోందా ? అధికార బీజేపీకి కూడా విమర్శించేందుకు బలమైన ప్రతిపక్ష నేత కావాలి.. భవిష్యత్‌లో రాహుల్ ప్రతిపక్ష నేతగా మారతారో, అధికారం చేపట్టే దిశగా అడుగుపెడతారో చూడాలి.

English summary
congress loss 2019 general elections, rahul gandhi quit president post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X