బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Congress: జేజమ్మకు జై, ఖార్గే, చినబాబుకు జై, సిద్దూ, రచ్చ మామూలుగా లేదు, ట్విట్ కు ట్విట్... అంతే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ ఆ పార్టీ నేతలు సోనియా గాంధీకి స్వయంగా రాసిన నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC)సమావేశంలో పెను ప్రకంపనలు రేపిందని తెలిసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకస్థుడు, లోక్ సభలో మోడీ ప్రభుత్వాన్ని ఢీకొడుతూ వచ్చిన మల్లిఖార్జున్ ఖార్గే కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

అయితే కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య మాకు చినబాబు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయితే మేలని బహిరంగంగా చెప్పడంతో లేదు మాకు జేజమ్మ (సోనియా గాంధీ)నే కావాలని మల్లిఖార్జున్ ఖార్గే ట్విట్ తో కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ బాధ్యతల విషయంలో చెరోమాట చెప్పడంతో ఆ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు.

135 years ఇండస్ట్రీ: సోనియానే చీఫ్ ? రాహుల్, ప్రియాంక ఎంట్రీ !, మోఢీని ఢీకొట్టాలంటే ఏం చెయ్యాలి!135 years ఇండస్ట్రీ: సోనియానే చీఫ్ ? రాహుల్, ప్రియాంక ఎంట్రీ !, మోఢీని ఢీకొట్టాలంటే ఏం చెయ్యాలి!

మాట మీద నిలబడిన సోనియా గాంధీ

మాట మీద నిలబడిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఏడాది కాలం పదవిలో ఉన్న సోనియా గాంధీ తన పదవికి రాజీనామా చేసి తన స్థానంలో మరో వ్యక్తిని నియమించాలని సీడబ్ల్యూసీకి మనవి చేశారు. సోనియా గాంధీ రాజీనామాతో 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను కొత్త వారికి అప్పగించాలని కొందరు నేతలు అంటున్నారు.

చినబాబుకు జై

చినబాబుకు జై

ఇదే సమయంలో గాంధీ కుటుంబానికి విధేయుడిగా ముద్రపడిన ఏకే. ఆంటోని రాహుల్ గాంధీని ఆ పదవిలో కొనసాగించాలని మనవి చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సైతం కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీకే అప్పగించాలని, దేశాన్ని, పార్టీని సమర్థవంతంగా నడిపించే సత్తా రాహుల్ గాంధీకి ఉందని, ఆయన నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉందని సోమవారం సిద్దరామయ్య ట్విట్ చేశారు. ఇదే సమయంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టన్ అమరీందర్ సింగ్ సైతం గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు.

రచ్చ మామూలుగా లేదు మిత్రమా

రచ్చ మామూలుగా లేదు మిత్రమా

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాకుంటే మరో నాయకుడికి కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగించాలని, అప్పుడే పార్టీ మీద కార్యకర్తలకు పూర్తి నమ్మకం వస్తుందని కొందరు సీనియర్ నాయకులు అన్నారని తెలిసింది. ఇలాంటి సమయంలో CWC నాయకులు సోనియా గాంధీకి రాసిన లేఖలు లీక్ కావడంతో వివాదం ముదిరిపోయింది.

జేజేమ్మకు జై...జై...జై

జేజేమ్మకు జై...జై...జై

ఒకోనక సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజ్యసభ సభ్యుడు, సోనియా గాంధీ నమ్మినబంటు మల్లిఖార్జున్ ఖార్గే పేరు తెర మీదకు వచ్చింది. అయితే కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య మాత్రం రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని చెప్పడంతో మల్లిఖార్జున్ ఖార్గే వర్గీయులు మండిపడ్డారు. ఇదే సమయంలో సిద్దరామయ్యకు మల్లిఖార్జున్ ఖార్గే కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో మాకు సోనియా గాంధీ నాయకత్వం కావాలి, జేజమ్మకు జై అంటూ ట్విట్ చేశారు. సిద్దరామయ్య రాహుల్ గాంధీ కావాలని చెప్పడం, మల్లిఖార్జున్ ఖార్గే సోనియా గాంధీ కావాలని చెప్పడంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వర్గాలు హడలిపోయాయి.

ఈనాటి ఈబంధం ఏనాటిదో

ఈనాటి ఈబంధం ఏనాటిదో

గతంలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మల్లిఖార్జున్ ఖార్గేని కర్ణాటక సీఎం చెయ్యాలని కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం డిమాండ్ చేసింది. అప్పటికే సీఎం కుర్చిలో ఉన్న సిద్దరామయ్యకు ఆ విషయం జీర్ణించుకోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు నేను కట్టుబడి ఉంటానని చెప్పిన సిద్దరామయ్య రాహుల్ గాంధీ ఆశీస్సులతో ఐదేళ్ల పాటు ఆయన సీఎం కుర్చిని కాపాడుకున్నారు. అయితే ఇంతకాలానికి సిద్దరామయ్య, మల్లిఖార్జున్ ఖార్గే వర్గీయుల మద్య కాంగ్రెస్ పార్టీ చీఫ్ విషయంలో శీతల సమరం మొదలైయ్యిందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు.

English summary
Congress party: The news that former parliamentary leader Mallikarjun Kharge will be made the AICC president has come to the fore. Former CM Siddaramaiah expressed his reaction to this via a tweet. Now, Mallikarjun Kharge reacted to Siddaramaiah's tweet. Mallikarjun Kharge has urged Sonia Gandhi to continue as AICC president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X