వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల కోసం రాష్ట్రపతి భవన్ కు కాంగ్రెస్ పాదయాత్ర .. ప్రియాంకా గాంధీ అరెస్ట్ ..భగ్గుమన్న కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

రైతులకు నష్టం చేకూర్చే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు కోట్ల సంతకాలను సేకరించి ఓ మెమోరాండం ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సమర్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఓ ప్రతినిధి బృందం రాష్ట్రపతి భవన్ కు బయలుదేరింది. ఇదే సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా తోపాటు మరి కొందరు నాయకులు కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలవడం కోసం బయలుదేరారు. అయితే రాష్ట్రపతిని కలవడానికి వారందరికీ అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు ప్రియాంక గాంధీ వాద్రా ను, ఆమెతో పాటు ఉన్న మరికొందరు నాయకులను అరెస్టు చేశారు.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

 రాష్ట్రపతిని కలిసేందుకు ప్రియాంకా గాంధీతో పాటు మరికొందరు నేతల పాదయాత్ర . అరెస్ట్ చేసిన పోలీసులు

రాష్ట్రపతిని కలిసేందుకు ప్రియాంకా గాంధీతో పాటు మరికొందరు నేతల పాదయాత్ర . అరెస్ట్ చేసిన పోలీసులు

రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతికి మెమొరాండం ఇవ్వటానికి ప్రియాంకా గాంధీ తో పాటు మరికొందరు నేతలు ఆందోళన చేస్తూ వెళ్తున్న క్రమంలో అడ్డుకున్న పొలేఉస్లు ప్రియాంకా గాంధీని అరెస్ట్ చేసి బస్సులో పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రొటెస్ట్ మార్చ్ నిర్వహించడానికి అనుమతి లేదని, నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల చర్యను ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చర్య చేసిన దానిని ప్రభుత్వం ఉగ్రవాద చర్య లాగ పరిగణిస్తోంది అంటూ ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు.

రైతులకు మద్దతు గా మార్చ్ చేస్తే తప్పా ? మండిపడిన ప్రియాంకా గాంధీ వాద్రా

రైతులకు మద్దతు గా మార్చ్ నిర్వహించదలిచామని, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ఎంపీలు రాష్ట్రపతిని కలవడానికి అందరికీ హక్కు ఉందని, కానీ ఇది ప్రభుత్వానికి ఇష్టంలేదని ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు.
ఈ వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యేవరకు రైతులు తమ సొంత ఊర్లకు తిరిగి వెళ్లాలని అనుకోవట్లేదని తాను ప్రధానికి చెప్పాలనుకుంటున్నాను అన్నారు ప్రియాంక గాంధీ వాద్రా. ప్రభుత్వం పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పాదయాత్ర చేపట్టిన ప్రియాంక అరెస్ట్ తో ఉద్రిక్తత

ప్రతిపక్ష పార్టీలు రైతుల పక్షాన నిలబడాలని, ఆమె పేర్కొన్నారు. భారతదేశంలో "ప్రజాస్వామ్యం" లేదని, ప్రధానికి వ్యతిరేకంగా నిలబడిన వారిని ఉగ్రవాదులు అని ముద్ర వేస్తున్నారన్నారు.
రైతులకు మా మద్దతును తెలియజేయడానికి మేము ఈ పాదయాత్రను చేపడుతున్నాము అని ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రపతిని కలవడానికి వెళ్లడానికి ప్రయత్నించారు . ఆమెను పోలీసులు ఆడుకోవటంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు .

రాహుల్ తో పాటు ముగ్గురిని అనుమతించిన అధికారులు .. వ్యవసాయ చట్టాల రద్దుకు రాహుల్ డిమాండ్


అయితే రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రపతిని కలవడం కోసం కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతి ఇచ్చారు రాష్ట్రపతి భవన్ అధికారులు.


రాహుల్ గాంధీ రాష్ట్రపతిని కలిసి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మెమొరాండం ఇచ్చారు . రైతుల సమస్యలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు.

English summary
Congress leaders led by Rahul Gandhi, marching to the Rashtrapati Bhavan, were stopped by the police before a small delegation was allowed to enter the presidential palace . Mr Gandhi's sister, Priyanka Gandhi Vadra, and several other leaders, were taken into preventive custody by the police and sent away in a bus to a police station after they were stopped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X