వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీ కొత్త సారధులుగా ,సుశీల్ కుమార్ షిండే, లేదా మల్లిఖార్జున్ ఖార్గే ...?

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజీనామ చేయడంతో పార్టీ కొత్త అధ్యక్షుడిగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి..ఈనేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి సుషిల్ కుమార్ షిండే, లేదా మరోపార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖార్గే పేర్లను పరీశీలిస్తున్నట్టు తెలుస్తోంది..కాగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గాంధీ కుటుంభం కాకుండా మూడో వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టబోతున్నారు..దీంతో గాంధీ కుటుంభానిక లాయల్‌గా ఉండే వ్యక్తితోపాటు పార్టీని నడిపించగల సమర్థత ఉన్న నాయకుడిని ఎంపిక చేసేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుశీల్ కుమర్ షిండేతోపాటు మల్లిఖార్జున్ ఖార్గె పేర్లు వినిపిస్తున్నాయి..అయితే వీరీలో ఎవరని ఫైనల్ చేస్తారనేది సోనియా గాంధీతోపాటు, అటు రాహుల్ , ప్రియాంక గాంధీలు నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..కాగా దళిత వర్గానికి చెందిన సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడంతోపాటు , యూనియన్ మినిస్టర్‌గా కూడ చేశాడు..కాగా 2002 నుండి పార్టీ ఉపాధ్యాక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇక మల్లికార్జున్ ఖార్గే సైతం కేంద్రమంత్రిగా పని చేయడంతోపాటు పార్లమెంటరీ పార్టీ నేతగా కూడ వ్యవహరించాడు..కాని ఇటివల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు.

Congress may choose Sushil Kumar Shinde and Mallikarjun Kharge as new party president

కాంగ్రెస్ పార్టీ రాహుల్ రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో .. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు మోతిలాల్ వోరాకు అప్పగిస్తారనే వార్తలు వెలువడ్డాయి. ఈనేపథ్యంలోనే అధ్యక్ష పదవీకి రాహుల్ రాజీనామా తర్వాత 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధ్యక్షులు కూడా రాజీనామా బాట పట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల చీఫ్‌లు బాధ్యత వహించాలని రాహుల్ స్పష్టంచేశారు. తాజాగా రాజీనామ లేఖను విడుదల చేసిన రాహుల్ గాంధీ .. ట్విట్టర్‌,ఫేస్ బుక్‌లో కూడ తన బయోడేటాను కూడా మార్చివేశారు . ఇదివరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా హోదా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని మార్చివేశారు.

English summary
After Rahul Gandhi, the Congress may choose between Sushil Kumar Shinde and Mallikarjun Kharge as new party president. The names emerged as Rahul Gandhi posted an open letter on his decision to resign taking responsibility for the Congress's national election defeat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X