వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈశాన్య రాష్ట్రాల ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు ఎఫెక్ట్; మణిపూర్ లో కాంగ్రెస్ కు ఎదురీత తప్పదా?

|
Google Oneindia TeluguNews

మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురీదాల్సిన పరిస్థితి వస్తుందా? ఇటీవల ఈశాన్య రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయా? మణిపూర్ రాష్ట్రంలో బిజెపిని భూస్థాపితం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజా ఉప ఎన్నికల ఫలితాలతో డీలా పడుతుందా? కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కోనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

మణిపూర్ ఎన్నికలపై బీజేపీ నజర్; 'గో టు విలేజ్ 2.0'ని ప్రారంభించిన జేపీ నడ్డా, మణిపూర్ సీఎంమణిపూర్ ఎన్నికలపై బీజేపీ నజర్; 'గో టు విలేజ్ 2.0'ని ప్రారంభించిన జేపీ నడ్డా, మణిపూర్ సీఎం

 ఈశాన్య రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కు షాక్

ఈశాన్య రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కు షాక్

మంగళవారం నాడు ప్రకటించిన ఈశాన్య రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలలో బిజెపి మరియు దాని మిత్రపక్షాలు క్లీన్ స్వీప్ చేయడంతో 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అవకాశాలు ప్రభావితం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అక్టోబరు 30న ఓటింగ్‌కు వెళ్లిన ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ మరియు మిజోరంలలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలను భారతీయ జనతా పార్టీ మరియు దాని మిత్రపక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అస్సాంలో చాలా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. ఇక ఈ ప్రభావం 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 మణిపూర్ లో కాంగ్రెస్ కు కష్టాలేనా ?

మణిపూర్ లో కాంగ్రెస్ కు కష్టాలేనా ?

మణిపూర్ విషయానికి వస్తే గత ఎన్నికలలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా, అత్యధిక స్థానాలను గెలుచుకున్న ప్పటికీ, ప్రాంతీయ మిత్రపక్షాల మద్దతుతో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ అప్పటి నుండి మణిపూర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన శాసనసభ్యుల ఫిరాయింపులను చూస్తోంది. ఇక రానున్న ఎన్నికలలో మణిపూర్లో బలమైన ప్రభావాన్ని చూపించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈశాన్య రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి అని చెప్పాలి.

గతంలో కాంగ్రెస్ కు బలం ఉన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ

గతంలో కాంగ్రెస్ కు బలం ఉన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ


మణిపూర్‌లోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగస్టులో మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ పనితీరుపై ఫిర్యాదు చేస్తూ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు పార్టీని వీడారు. అంతేకాదు విశ్వాస పరీక్షలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అధికార కూటమిలో స్పీకర్‌తో సహా 29 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ సంఖ్య తగ్గింది. అస్సాంతో పాటు, త్రిపుర, మణిపూర్ మరియు అరుణాచల్ ప్రదేశ్‌లలో బిజెపి ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తుంది.

ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీ శ్రేణుల్లో ధీమా

ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీ శ్రేణుల్లో ధీమా

మంగళవారం ఉపఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఎన్నికలలో విజయం సాధించేలా ముందుకు తీసుకు వెళుతున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.ఈశాన్య రాష్ట్రాల బహుముఖ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి యొక్క సర్వతోముఖ మిషన్ కారణంగా, ప్రజలు ఎన్డీఏ మిత్రపక్షాలకు తమ హృదయపూర్వక మద్దతు ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో మా విజయంతో, బిజెపి మరియు ఎన్డీఏ బాధ్యత మరింత పెరిగింది అని శర్మ పేర్కొన్నారు.

గోవా, మణిపూర్ లో కాంగ్రెస్ పై తాజా ఉప ఎన్నికల ప్రభావం

గోవా, మణిపూర్ లో కాంగ్రెస్ పై తాజా ఉప ఎన్నికల ప్రభావం

అక్టోబరు 30న ఎన్నికలు జరిగిన ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మిజోరాంలలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలను బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి.దశాబ్దాలుగా ఈ రాష్ట్రాలను పాలించిన కాంగ్రెస్‌ జీరోగా మిగలడం భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది అని చెప్పడంలో, ముఖ్యంగా గోవా, మణిపూర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

English summary
The clean sweep of the BJP and its allies in the Northeastern by-election results announced recently gave a big shock to congress. political analysts says that the Congress chances in the 2022 Manipur Assembly elections may be affected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X