వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీకి అక్రమ మైనింగ్, సోలార్ ప్లాంట్ లింక్, డీకే బినామీ?, ఎన్ని కోట్ల ఆస్తి, క్రిమినల్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రుబల్ షూటర్ డీకే. శివకుమార్ తీహార్ జైల్లో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి బెళగావి గ్రామీణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ ను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల సమయంలో లక్ష్మీ హెబ్బాళ్కర్ ఎంత ఆస్తి చూపించారు ? ఇప్పుడు ఆమె ఆస్తి ఎంత ఉంది ? క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నాయా ? డీకే. శివకుమార్ కు ఆమె అత్యంత సన్నిహితురాలు ఎలా అయ్యారు ? అక్రమ మైనింగ్, సోలార్ ప్లాంట్ ల వ్యవహాకం ఏమిటి ? అంటూ ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

డీకే మామకు ఈడీ సమన్లు, జైలుకు పంపిస్తారా?, సింగపూర్ ఫ్రెండ్, ఐశ్వర్య, లక్ష్మీ పని !డీకే మామకు ఈడీ సమన్లు, జైలుకు పంపిస్తారా?, సింగపూర్ ఫ్రెండ్, ఐశ్వర్య, లక్ష్మీ పని !

సోలార్ ప్లాంట్లు, మైనింగ్ లింక్ !

సోలార్ ప్లాంట్లు, మైనింగ్ లింక్ !

కర్ణాటక విద్యుత్ శాఖా మంత్రిగా డీకే. శివకుమార్ పని చేసిన సమయంలో మంజూరు అయిన సోలార్ ప్లాంట్లు, మైనింగ్ వ్యవహారంలో కంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్, ఆమె సోదరుడు చెన్నరాజు భారీగా పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. డీకే. శివకుమార్ హవాలా దందాకు లక్ష్మీ హెబ్బాళ్కర్, ఆమె సోదరుడు చెన్నరాజు బినామీలుగా ఉన్నారని ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు ఇప్పుడు వారిని విచారణ చేస్తున్నారు.

లక్ష్మీ మీద కేసులు

లక్ష్మీ మీద కేసులు

గత శాసన సభ ఎన్నికల సమయంలో కుక్కర్లు పంచిపెట్టారని, అక్రమంగా నగదు ఓటర్లకు పంపిపెట్టారని లక్ష్మీ హెబ్బాళ్కర్ మీద రెండు కేసులు నమోదైనాయి. ఈ రెండు కేసులు మినహా లక్ష్మీ హెబ్బాళ్కర్ మీద ఎలాంటి కేసులు లేవని సమాచారం. తన మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, తాను దోషి అని కోర్టు కూడా చెప్పలేదని లక్ష్మీ హెబ్బాళ్కర్ ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు.

ఎంత ఆస్తులు !

ఎంత ఆస్తులు !

2018 కంటే ముందు డీకే. శివకుమార్ ఆస్తి రూ. 251 కోట్లు. 2018 ఎన్నికల సమయంలో డీకే. శివకుమార్ ఆస్తి రూ. 548 కోట్లు ప్రకటించారు. బ్యాంకులో తనకు రూ. 101 కోట్ల అప్పులు ఉన్నాయని డీకే. శివకుమార్ ఎన్నికల కమిషన్ కు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి డీకే. శివకుమార్ మొత్తం ఆస్తి రూ. 840 కోట్లకు పైగా ఉంది. డీకే. శివకుమార్ భార్య ఉషా పేరు మీద రూ. 46 కోట్లు, కుమార్తె ఐశ్వర్య (23) పేరు మీద రూ. 102 కోట్ల ఆస్తి ఉంది. రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారంలో ఐశ్వర్య పెట్టుబడులు పెట్టారని, లాభాలు ఎక్కువగా వచ్చాయని డీకే. శివకుమార్ ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు.

లక్ష్మీ ఆస్తులు ఎంతంటే ?

లక్ష్మీ ఆస్తులు ఎంతంటే ?

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ మీద ఇప్పటి వరకూ 6 కేసులు ఉన్నాయి. బెళగావిలో ఆ కేసులు విచారణలో ఉన్నాయి. ఇంత వరకూ లక్ష్మీ హెబ్బాళ్కర్ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. డీకే. శివకుమార్ అక్రమాస్తుల కేసులో లక్ష్మీ హెబ్బాళ్కర్ పేరు తోడు అయితే మరో కేసు ఆమె మీద నమోదు అవుతుంది. శుక్రవారం ఈడీ కార్యాలయం ముందు హాజరైన లక్ష్మీ హెబ్బాళ్కర్ తన ఆస్తులు మొత్తం రూ. 27 కోట్లు ఉంటుందని, అన్నీ సరైన పత్రాలు చూపించడానికి తాను సిద్దంగా ఉన్నానని ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిసింది.

English summary
PMLA Case: Karnataka senior Congress leader D K Shivakumar's aide Belagavi Rurul MLA Lakshmi Hebbalkar also questioned by ED in Money launderig case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X