వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీహార్ జైల్లో డీకే టెన్షన్ టెన్షన్: ఈడీ ఎవర్నీ పిలిచినా అదే పరిస్థితి, ఐశ్వర్య, లక్ష్మీ!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ తీహార్ జైల్లో ఆందోళనతో ఉన్నారని, ఈడీ అధికారులు ఎవర్ని విచారణ చేసినా ఒకటే టెన్షన్ పడిపోతున్నారని సమాచారం. తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి డీకే. శివకుమార్ ఆయన కుమార్తె ఐశ్వర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్, మామ తిమ్మయ్య తదితరులను ఈడీ అధికారులు విచారణ చేస్తున్న సమయంలో ఒకటే టెన్షన్ పడిపోతున్నారని సమాచారం.

మంచం మీదకు వస్తే మజా చేద్దాం, స్వామీజీ ఆడియో, వీడియోలు వైరల్, భర్త హనీట్రాప్!మంచం మీదకు వస్తే మజా చేద్దాం, స్వామీజీ ఆడియో, వీడియోలు వైరల్, భర్త హనీట్రాప్!

కూతురుని చూసి ఆసుపత్రిలో !

కూతురుని చూసి ఆసుపత్రిలో !

ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కుమార్తె ఐశ్వర్యను చూసిన వెంటనే డీకే. శివకుమార్ కుప్పకూలిపోయారు. వెంటనే డీకే. శివకుమార్ ను రామ్ లోహియా ఆసుపత్రికి తరలించించి చికిత్స చేయించారు. డీకే. శివకుమార్ ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆయన కుమార్తె ఐశ్వర్యను విచారణ చేసి వివరాలు సేకరించారు.

లక్ష్మీ పత్రాలు

లక్ష్మీ పత్రాలు

ఢిల్లీలోని ఈడీ అధికారుల ముందు గురువారం విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ సరైన పత్రాలు చూపించలేదని సమాచారం. శుక్రవారం మీ ఆస్తులకు సంబంధించి, నగదు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు అన్నీ తీసుకురావాలని ఈడీ అధికారులు లక్ష్మీ హెబ్బాళ్కర్ కు సూచించారు. డీకే. శివకుమార్ తనకు రాజకీయ గురువు మాత్రమే అని, ఆయనతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని లక్ష్మీ హెబ్బాళ్కర్ అంటున్నారు.

184 మందికి నోటీసులు

184 మందికి నోటీసులు

డీకే. శివకుమార్ ను విచారణ చేస్తున్న ఈడీ అధికారులు ఇప్పటి వరకు 184 మందికి నోటీసులు ఇచ్చారు. ఆ 184 మందిలో తాను ఒక్కరు అని లక్ష్మీ హెబ్బాళ్కర్ అంటున్నారు. ఇంతకు ముందు రెండు సార్లు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారని ,ఇప్పుడు ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారని, తనకు ఎలాంటి భయం లేదని లక్ష్మీ హెబ్బాళ్కర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తీహార్ జైల్లో టెన్షన్

తీహార్ జైల్లో టెన్షన్

డీకే. శివకుమార్ సన్నిహితులు ఒక్కక్కరిని ఈడీ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే డీకే. శివకుమార్ సన్నిహితులకు ఈడీ అధికారులు నోటీసులు అందించారు. ప్రస్తుతం అరెస్టు అయ్యి తీహార్ జైలులో ఉన్న డీకే. శివకుమార్ చాల టెన్షన్ పడుతున్నారని తెలిసింది. మొత్తం మీద డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసులో ఇంకా ఎంత మంది అరెస్టు అవుతారో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Karnataka Congress MLA Lakshmi Hebbalkar on Friday, Will Appear before the Enforcement Directorate (ED) to record her statement in connection with an alleged money laundering case against her party colleague D.K. Shivakumar and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X