వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే హల్‌చల్.. మహిళ సిబ్బందితో...

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్ : ఎయిర్‌పోర్టు మహిళ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడో ప్రజా ప్రతినిధి. తాను రావాల్సిన సమయానికి రాకపోగా .. సిబ్బందితో దూషించాడు. దీనిని ఎయిర్ ఇండియా వర్గాలు కూడా ధ్రువీకరించాయి. గతనెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కానీ తాను సమయానికే వచ్చానని .. లగేజీలో తాను, తన అనుచరుల బ్యాగేజీ లేట్ చేశారని .. అందుకే ఆలస్యమైందని సదరు నేత చెప్తున్నారు.

లేట్‌గా వచ్చి ..

లేట్‌గా వచ్చి ..

ఛత్తీస్‌గడ్‌లోని మహసముంద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ చంద్రకర్ .. ఎయిర్ ఇండియా మహిళ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నెల 7న ఆయన రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే అతను ఆలస్యంగా రావడంతో బోర్డింగ్‌కు పంపించలేదు. లేట్ అయినా తనను పంపించాలని ఎయిర్‌పోర్టు సిబ్బందితో గొడవకు దిగాడు. వాస్తవానికి సాయంత్రం 5.36 గంటలకు ఆయన చేరుకోవాలి. కానీ 6.12 గంటలైనా చేరుకోలేదు. దీంతో వచ్చే ప్రయాణికులను సిబ్బంది నిలిపివేశారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే .. సిబ్బందిపై నోరుజారారు.

జీవితకాల ఆలస్యమా ?

జీవితకాల ఆలస్యమా ?

వాస్తవానికి సంబంధిత విమానానికి సంబంధించి రెండుగంటల ముందే బోర్డింగ్ పూర్తి చేస్తారు. అరగంట ముందే ప్రయాణికులు విమానంలో ఉండేట్టు చూసుకుంటారు. ఇదీ ఎయిర్‌పోర్టు నిబంధనలు కూడా. కానీ వినోద్ ఆలస్యంగా చేరుకోవడమే గాక గొడవకు కూడా దిగాడు. సాయంత్రం 5.36కు బోర్డింగ్ ప్రక్రియ పూర్తయిన .. 6.13 గంటల వరకు చూశామని .. 6.15 గంటల వరకు ప్రయాణికులను నిలిపివేశామని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు. 6.18 గంటలకు విమాన డోర్లు మూసివేసి .. 6.30 గంటలకు విమానం గాలిలోకి ఎగిరిందని ఎయిర్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ ఎమ్మెల్యే వాదన

ఇదీ ఎమ్మెల్యే వాదన

కానీ ఎమ్మెల్యే మాత్రం విచిత్రంగా వాదిస్తున్నారు. తాను ఎయిర్‌పోర్టుకు నిర్ణీత సమయానికి చేరుకున్నానని వివరించారు. సాయంత్రం 5.30 గంటలకు చేరానని .. కానీ తన లగేజి వద్ద ఆలస్యమైందని చెప్తున్నారు. తన బ్యాగేజీని సిబ్బంది రెండుసార్లు చెక్ చేశారని ఆరోపించారు. తన బృందం లగేజీ చెక్ చేయడం కూడా లేట్ అయ్యిందని పేర్కొన్నారు. తాము రావడంతోనే మహిళ సిబ్బంది తనపై అరిచారని గుర్తుచేశారు. బోర్డింగ్‌కు అనుమతించబోమని తెలిపారు. దీంతో ఎందుకు అలో చేయరని మాత్రం తాను అడిగానని పేర్కొన్నారు.

English summary
Congress MLA Vinod Chandrakar from Mahasamund assembly of Chhattisgarh has been accused of humiliating a female staff of Air India at Raipur airport on August 7 after she did not allow him to board the plane as he reached airport late, as per the Air India’s (AI) initial report. “The boarding card of the MLA was taken out in advance at 17:36 hours. All the passengers were boarded except five passengers. Repeated announcement was made at the security hold area (SHA) and also check-in area at 18:12 hours,” says the report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X