బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంకీర్ణ ప్రభుత్వం కథ కంచికి: కాంగ్రెస్ కు మాజీ హోంత్రి రామలింగా రెడ్డి షాక్, అసమ్మతి రాగం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కథ క్లైమాక్స్ ఉచ్చిందంటే అవును అంటున్నారు కొందరు కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీలో నీతి, నీజాయి కలిగిన నాయకుడిగా పేరు సంపాదించుకున్న మాజీ హోం శాఖా మంత్రి, బెంగళూరు నగరంలోని బీటీఎం లేఔట్ నియోజక వర్గం శాసన సభ్యుడు రామలింగా రెడ్డి ఆ పార్టీ నాయకుల మీద మంగళవారం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు కొందరు సీనియర్లను దూరడం పెడుతున్నారని, అధికార దాహాంతో ప్రవర్థిస్తున్నారని రామలింగా రెడ్డి సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. రామలింగా రెడ్డి సౌమ్య రెడ్డి కూడా బెంగళూరు జయనగర ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు.

రామలింగా రెడ్డి మౌనం

రామలింగా రెడ్డి మౌనం

ఐదు సార్లు శాసన సభ్యుడిగా విజయం సాందించి హోం శాఖా మంత్రిగా పని చేసిన రామలింగా రెడ్డి ఆయన రాజకీయ జీవితంలో ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుతిరిగేదు. కొందరు సీనియర్లు తనను పట్టించుకోకున్నా సరే ఆయన మౌనంగా ఉండే వారు. అయితే మంగళవారం (జూన్ 4వ తేది) మౌనం వీడి కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకుల వలనే నేడు ఈ పరిస్థితి వచ్చిందని, లోక్ సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయామని ట్వీట్ చెయ్యడంతో ఆ పార్టీ నాయకులు హడలిపోయారు.

కాంగ్రెస్ కు సవాల్

కాంగ్రెస్ కు సవాల్

మాజీ మంత్రి రామలింగా రెడ్డి మంగళవారం వరుస ట్వీట్లు చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. వలసలు వచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వెయ్యడంతో ఇలాంటి పరిస్థితి ఎదురైయ్యిందని రామలింగా రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను పట్టించుకోవడం లేదని, ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తించడం జరుగుతుందని, ఇలాగే వదిలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలు ఎదురైయ్య అవకాశం ఉందని రామలింగా రెడ్డి హై కమాండ్ ను పరోక్షంగా హెచ్చరించారు.

మంత్రులే కారణం

మంత్రులే కారణం

కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మంత్రుల వలనే లోక్ సభ ఎన్నికల్లో దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని రామలింగా రెడ్డి ట్లీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లోక్ సభ ఎన్నికల్లో కార్యకర్తలు చురుకుగా పని చెయ్యలేదని, అందుకు కారణం కొందరు మంత్రులే అని రామలింగా రెడ్డి ఆరోపించారు. కొందరు మంత్రులు కార్యకర్తలను పట్టించుకోలేదని, వారితో కలిసి పని చెయ్యలేదని రామలింగా రెడ్డి విమర్శించారు.

సీనియర్ల సలహాలు

సీనియర్ల సలహాలు

ప్రభుత్వంలో, పార్టీలో సీనియర్లను దూరం పెట్టడం వలనే ఇలాంటి సమస్యలు ఎదురౌతున్నాయని అనేక సార్లు కార్యకర్తలు చెప్పినా కొందరు నాయకులు పట్టించుకోలేదని రామలింగా రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో, పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుంటే పరిస్థితి చెయ్యదాటిపోయే అవకాశం ఉందని రామలింగా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

రామలింగా రెడ్డి షాక్

రామలింగా రెడ్డి షాక్

కాంగ్రెస్ పార్టీ చెప్పిందే మాటగా ఇంత కాలం ఎవ్వరిని దూషించని రామలింగా రెడ్డి ఒక్క సారిగా సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు. ఎందరో నాయకులు అసమ్మతితో రలిగిపోతున్నా రామలింగా రెడ్డి మత్రం మౌనంగా ఉన్నారు. అలాంటి నాయకుడు నేడు కొందరు సొంత పార్టీ నాయకుల తీరును విమర్శించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు.

English summary
Bengaluru: BTM layout MLA, Congress leader Ramalinga Reddy expresses his anger on some of Congress ministers on twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X