వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక రాష్ట్రం అడిగితే ఎంఎల్ఏని సస్పెండ్ చేశారు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రత్యేక రాష్ట్రం కావాలని సొంత పార్టీ మీద తిరుగుబాటు చేసిన శాసన సభ్యుడి మీద కాంగ్రెస్ పెద్దలు వేటు వేశారు. ఉత్తర కర్ణాటక ను ప్రతేక్య రాష్ట్రం చెయ్యాలని డిమాండ్ చేసిన దేవరహిప్పగిరి శాసన సభ నియోజక వర్గం ఎంఎల్ఏ ఎ.ఎస్. పాటిల మీద వేటు వేస్తూ కాంగ్రెస్ శాసన సభ్యల సమావేశం (సీఎల్ పీ) తీర్మానించింది.

బెంగళూరు నగరం శరవేగంగా అన్ని రంగాలలో అభివృద్ది చెందాలంటే మూడు భాగాలుగా విభజించాలని సీఎం సిద్దరామయ్య, బెంగళూరు నగర ఇన్ చార్జ్ మంత్రి రామలింగారెడ్డి పదేపదే మీడియా ముందు చెప్పారు. ఎట్టి పరిస్థితులలో బెంగళూరు విభజన కు బ్రేక్ వెయ్యమని అన్నారు.

Congress MLA a s Patiala Suspended in Karnataka

ఉత్తర కర్ణాటకలోని అన్ని జిల్లాలలో తాగు నీటి సౌకర్యం లేదని, కనీస సౌకర్యాలు లేక స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు ఎ.ఎస్. పాటిల ఆరోపించారు. బెంగళూరును విభజించే కంటే ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని డిమాండ్ చేశారు.

బహిరంగంగా సీఎం సిద్దరామయ్య మీద తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ పెద్దలు ఎ.ఎస్. పాటిల మీద ఫైర్ అయ్యారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎ.ఎస్. పాటిల మీద చర్యలు తీసుకొవాలని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరకు మనవి చేశారు.

చివరికి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని ఆదేశాలు జారీ చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు బుధవారం చేతికి అందాయని, స్వయంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ను కలిసి వివరణ ఇచ్చేలోపు వేటు వేశారని ఎ.ఎస్. పాటిల విచారం వ్యక్తం చేశారు.

English summary
Congress Legislature Party Secretary Appaji Nadagouda on Wednesday recommended KPCC president Dr.G.Parameshwara to suspend Vijayapura district Devar Hipparagi MLA A.S. Patil who raised voice for separate state, north Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X