వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుకు మందే విరుగుడు: వైన్ షాపులు తెరిపించండి.. లాజిక్ చెబుతూ సీఎంకు ఎమ్మెల్యే లేఖ

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్: మందుకు లాజిక్ ఉండదు. తాగడం తూలడం అదే లాజిక్ అని చెబుతుంటారు మందుబాబులు. తాగామా ఊగామా అంతవరకే ఉంటుంది. కరోనా ఉంటే ఏంటి.. లేకుంటే ఏంటి.. మందు ఉందా లేదా అన్నదే కొందరి వాదన. ఇక కరోనావైరస్ విజృంభణతో లాక్‌డౌన్‌లోకి దేశం వెళ్లిపోవడంతో అందరి పరిస్థితి ఒకలా ఉంటే మందుబాబుల పరిస్తితి మాత్రం మరోలా ఉంది. నాలుకపై చుక్క లేక నెల రోజులకు పైగా అవుతుండటంతో మందుబాబుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సరే వీరి బాధ ఒకలా ఉంటే ప్రజలకు మంచి చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు కూడా మందేస్తేనే కరోనా రాదు అని చెబుతుండటం చర్చనీయాంశమైంది.

కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది: ఆ జంతువులపై సక్సెస్, ఈ ఏడాదిలోనే...!కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది: ఆ జంతువులపై సక్సెస్, ఈ ఏడాదిలోనే...!

ఎమ్మెల్యేకు జై కొట్టిన మందుబాబులు

ఎమ్మెల్యేకు జై కొట్టిన మందుబాబులు

కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తోంటే మందుబాబులు మాత్రం దానికి సరైన మందు మందే అని చెబుతున్నారు. సాదాసీదా ప్రజలు చెబితే ఓకే.. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఒకరు చెప్పడం చూస్తే దీనిపై పెద్ద చర్చనే జరుగుతోంది. మందుబాబులంతా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేకే జై కొట్టడం విశేషం. ఇక అసలు కథలోకి వస్తే... రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ ఒక వింత వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆయన లాజిక్ వింటే ఎవరైనా సరే కాస్త కన్విన్స్ అవ్వాల్సిందే అనేలా ఉంది. ఇంతకీ ఆ లాజిక్ ఏంటో తెలుసా..?

శానిటైజర్‌లో ఆల్కహాల్ ఉంది.. మద్యంలో ఆల్కహాల్

శానిటైజర్‌లో ఆల్కహాల్ ఉంది.. మద్యంలో ఆల్కహాల్


కరోనావైరస్‌కు విరుగుడు శానిటైజర్లని ప్రభుత్వాలు చెబుతున్నాయి. శానిటైజర్లను దగ్గరే ఉంచుకుని అప్పుడప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఇంత వరకు కహానీ బాగానే ఉంది. అయితే శానిటైజర్లను ఆల్కహాల్‌తో తయారు చేస్తారు. మరి ఆల్కహాల్‌తో తయారు చేసే శానిటైజర్లు కరోనావైరస్‌ను చంపుతుందనే మాటలో ఎంత నిజముందో ఆల్కహాల్‌ కంటెంట్ ఉండే మద్యం కూడా కరోనావైరస్‌ను చంపుతుందనే వాదనను ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ తీసుకొచ్చారు. అంతేకాదు గొంతు నుంచే ఊపిరి తిత్తులకు వైరస్ వెళుతుంది కాబట్టి మందు కొడితే.. ఆ మందు గొంతులో ఉన్న కరోనాను కొట్టి చంపేస్తుందనే లాజిక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ చెప్పారు. ఇదే లాజిక్‌ను పేర్కొంటూ లిక్కర్ షాపులు ఓపెన్ చేయాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాశారు.

ఎమ్మెల్యే వాదనకు మరికొందరు మద్దతు

ఎమ్మెల్యే వాదనకు మరికొందరు మద్దతు

లిక్కర్ షాపులను ప్రారంభిస్తే... కరోనావైరస్ నుంచి మందుబాబులను కాపడటమే కాదు రాష్ట్రానికి రెవిన్యూ కూడా తెచ్చిపెడుతుందంటూ లేఖలో రాశారు ఎమ్మెల్యే భరత్ సింగ్. ఇలా లిక్కర్ షాపులు ఓపెన్ చేయించాలని భరత్ సింగ్ మాత్రమే కోరడం లేదు.. సీపీఐఎం ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ పూనియా కూడా ఎమ్మెల్యే భరత్ సింగ్‌ వాదనతో గొంతు కలిపారు. మద్యం దుకాణాలు మూసివేయడం వల్ల ఇటు రాష్ట్ర రెవిన్యూకు నష్టం వాటిల్లడంతో పాటు అటు మందుబాబులు కూడా మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పారు. ఇక మద్యం దొరక్క కొందరు కల్తీ మందు తాగి ప్రాణాలు తీసుకుంటున్నారని లేఖలో ఎమ్మెల్యే భరత్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

English summary
If alcohol-based sanitisers can kill coronavirus on hands, there is no reason why alcoholic drinks may not kill the virus in tipplers’ throats, a Congress MLA has argued, seeking reopening of liquor shops in Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X