వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ రెడీగా లేకపోతే ఎన్నికలు పెట్టేయండి- సోనియాకు శశిథరూర్ సూచన

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ విముఖత చూపుతున్న వేళ మరికొన్నాళ్ల పాటు అధినేత్రి సోనియాగాంధీయే బాధ్యతలు కొనసాగిస్తారని తాజాగా పార్టీ నేత అభిషేక్ మనుసింఘ్వీ ప్రకటించారు. అయితే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సోనియా ఇంకెంతకాలం పార్టీ బరువు బాధ్యతలు మోయాలన్న ప్రశ్న కాంగ్రెస్ నేతల్లో తలెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు దీనిపై స్పందించడం మొదలుపెట్టారు.

కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేకపోతే వెంటనే ఎన్నికలు నిర్వహించవచ్చు కదా అంటూ ఆ పార్టీ నేత, ఎంపీ శశిథరూర్ ఓ జాతీయ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ పగ్గాలను ఇబ్బంది పడుతూనే మోయడం సరికాదని, రాహుల్ ముందుకు వస్తే మంచిదని శశిధరూర్ సూచించారు. ఆయన సిద్ధంగా లేకపోతే మాత్రం ఎన్నికలకు వెళితేనే మంచిదన్నారు. దీంతో శశిధరూర్ వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.

congress must go for elections if rahul is not ready says shashi tharoor

గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధ్యక్ష పదవి తీసుకున్న రాహుల్ గాంధీ.. ఘోర పరాజయం నేపథ్యంలో దానికి గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్దితుల్లో తల్లి సోనియా గాంధీ ఈ బాధ్యతలు మోస్తున్నారు. కానీ రాహుల్ ముందుకొస్తే నామమాత్రంగా ఎన్నికలు నిర్వహించి ఆయనకు పగ్గాలు అప్పగించాలని పార్టీ సీనియర్లతో పాటు సోనియా కూడా భావిస్తున్నారు. అది కుదరకపోవడంతో కనీసం రాహుల్ లేకుండానే ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.

English summary
congress party senior leader and mp shashi tharoor once again made interesting comments on rahul gandhi. if rahul gandhi is not ready to take the reins, congress party should go for elections, shashi says
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X