వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సన్మాన పత్రమా?: 2జీ కేసులో కాంగ్రెస్ వైఖరిపై జైట్లీ ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసులో పటియాలా హౌస్ కోర్టు తీర్పుపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ సన్మాన పత్రంలా భావిస్తోందని, ఆ వైఖరి సరికాదని జైట్లీ వ్యాఖ్యానించారు. తీర్పు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

Recommended Video

2G spectrum scam : 2జీ స్కాం: డీఎంకే సంబరాలు, వీడియో !

2012లో అవినీతి, మోసపూరిత పాలసీ అని సుప్రీంకోర్టు తేల్చిందని ఈ సందర్భంగా జైట్లీ గుర్తు చేశారు. అంతేగాక అన్ని లైసెన్సులు కూడా నిలిపేసిందన్నారు. 2జీ కేటాయింపులు సక్రమమని కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు.

తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ సంబరపడిపోతోందని, అయితే, నిబంధనలకు విరుద్ధంగా 2జీ కేటాయింపులు జరిగాయని జైట్లీ ఆరోపించారు. యూపీఏ హయాంలో 2007లో కేటాయించిన 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సులను 2001 రేట్లకనుగుణంగా కేటాయించి, ప్రభుత్వానికి తీరని నష్టం చేకూర్చారని మండిపడ్డారు.

యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఛార్జీషీటు తిరిగి పరిశీలించాలని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అరుణ్ జైట్లీ చెప్పారు.

English summary
Reacting to 2G verdict, Finance Minister Arun Jaitley on Thursday said that Congress must not consider the verdict as a certificate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X