వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధమ్కీ: కాంగ్రెసుతో నేషనల్ కాన్ఫరెన్స్ కటీఫ్‌కు రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Omar Abdullah
న్యూఢిల్లీ‌‌: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెసుకు పెద్ద ధమ్కీ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడానికి నేషనల్ కాన్ఫరెన్స్ సిద్ధపడినట్లు సమాచారం. ఇరు పార్టీల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకోవడంతో కాంగ్రెసుతో దోస్తీని తెంచుకోవాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఎప్రిల్ - మే నెలల్లో లోకసభ ఎన్నికలు, ఈ ఏడాది అక్టోబర్ -నవంబర్ నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థితిలో రాష్ట్రంలో 700 కొత్త పాలనా విభాగాలను ఏర్పాటు చేయాలని ఒమర్ అబ్దుల్లా తలపెట్టారు. ఈ ఆలోచనను కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా వ్యతరేకిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య తెగదెంపులు చేసుకునే పరిస్థితి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ అంబికా సోనీ, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సైఫుద్దీన్ సోజ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, ఒమర్ సోమవారంనాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా ఏ విధమైన పరిష్కారం లబించలేదు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి కలిసి వచ్చే పథకాన్ని కాంగ్రెసు వ్యతిరేకించడం ఎన్‌సి వర్గాలకు రుచించడం లేదు. కాంగ్రెసు తీరు పట్ల ఒమర్ అబ్దుల్లా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ స్థితిలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలోపడినట్లు చెబుతున్నారు. తద్వారా లోకసభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు వచ్చేలా ఒమర్ అబ్దుల్లా చూస్తున్నట్లు చెబుతున్నారు. ఒమర్ అబ్దుల్లా రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది.

English summary

 The ruling coalition between the Congress and the National Conference (NC) in Jammu & Kashmir may split amid indications that chief minister Omar Abdullah was considering resigning following sharp differences between the two parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X