• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాష్ట్రపతి పాలనకు బాధ్యులెవరు?: జాప్యం చేసిన కాంగ్రెస్-ఎన్సీపీ: దెబ్బకొట్టిన బీజేపీ

|

ముంబై: అధికారం చేతుల్లో ఉంటే ఏదైనా చేయొచ్చనేది ఓ రాజకీయపరమైన రొడ్డ కొట్టుడు సామెత. మహారాష్ట్ర రాజకీయాల్లో అదే వ్యూహాన్ని అనుసరించింది భారతీయ జనతా పార్టీ. ప్రత్యర్థి బలహీనత తెలుసుకుంది. మెరుపు నిర్ణయాలను తీసుకోలేవని పసిగట్టింది. అధికారాన్ని అందుకోవడానికి తన ప్రత్యర్థులు మీన, మేషాలను లెక్కించడాన్ని అనుకూలంగా మార్చుకుంది. అదును చూసి దెబ్బకొట్టింది. బీజేపీ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఉంటుంది బీజేపీ ప్రత్యర్థులకు. గవర్నర్ విధించిన గడువు ఇంకా ఉన్నప్పటికీ.. రాష్ట్రపతి పాలనను విధించేలా చర్యలు తీసుకుంది.

ఆపరేషన్ కమలం: మహారాష్ట్ర.. మరో కర్ణాటక అవుతుందా? శరద్ పవార్ ఆందోళనకు కారణాలేంటీ?

 కాంగ్రెస్-ఎన్సీపీల జాప్యమే కారణమా?

కాంగ్రెస్-ఎన్సీపీల జాప్యమే కారణమా?

కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు జాప్యం చేయడమే బీజేపీకి కలిసి వచ్చిందనే అనుకోవచ్చు. దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడి 20 రోజులు కావస్తోంది. ఈ నెల 8వ తేదీ నాటికి మహారాష్ట్ర అసెంబ్లీ గడువు సైతం ముగిసిపోయింది. అయినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మల్లగుల్లాలు పడ్డాయి బీజేపీయేతర పార్టీలన్నీ. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా? చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఎలాంటి పరిణామాలను చవి చూడాల్సి వస్తుంది? అంటూ సమావేశాల పేరుతో కాలయాపన చేశాయి.

ఆ జాప్యాన్నే అస్త్రంగా..

ఆ జాప్యాన్నే అస్త్రంగా..

ఇప్పుడు కాంగ్రెస్-ఎన్సీపీలు చేసిన జాప్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది బీజేపీ. ఊహించిన విధంగా రాష్ట్రపతి పాలనకు తెర తీసింది. ఫలితాలు వెలువడిన 20 రోజుల తరువాత కూడా ప్రభుత్వం ఏర్పాటు కాలేదనే ఒకే ఒక్క కారణాన్ని చూపారు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి. ఈ కారణంతోనే రాష్ట్రపతి పాలనకు ఆయన సిఫారసు చేశారు. ఉరుము లేని పిడుగులాగా రాష్ట్రపతి పాలనను చవి చూడాల్సి రావడంతో బిత్తరపోవడం బీజేపీయేతర పార్టీల పనైంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నాయి. ప్రస్తుతం శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల ముందు ఉన్న ఏకైక మార్గం అదొక్కటే. న్యాయ పోరాటంలో భాగంగా.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేశాయి కూడా.

తాను ఇచ్చిన గడువును తానే..

తాను ఇచ్చిన గడువును తానే..

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి శివసేనకు ఓ అవకాశాన్ని ఇచ్చారు. సోమవారం సాయంత్రం 7-30 గంటలలోగా తన నిర్ణయాన్ని తెలియజేయాలని సూచించారు. అప్పటికీ పొంచివున్న ప్రమాదాన్ని కాంగ్రెస్ గానీ, ఎన్సీపీ గానీ గుర్తించలేకపోయాయనే అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గడువు పొడిగించాలని కోరిన శివసేనకు మరో అవకాశాన్ని ఇచ్చారు గవర్నర్. మంగళవారం రాత్రి 8:30 గంటల వరకు అవకాశం ఇచ్చారు. గడువు దగ్గర పడుతుండటంతో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి కాంగ్రెస్-ఎన్సీపీలు. కాంగ్రెస్-ఎన్సీపీలు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో బీజేపీ అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గవర్నర్ ఇచ్చిన గడువు ఉన్నప్పటికీ.. రాష్ట్రపతి పాలన విధించేలా పావులు కదిపింది.

బీజేపీ తొందర పడిందా?

బీజేపీ తొందర పడిందా?

మహారాష్ట్రను రాష్ట్రపతి పాలనలోకి తీసుకుని వచ్చి బీజేపీ తొందర పడిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలను పంపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను భయ పెట్టడానికి ఇప్పటికే సీబీఐ, ఈడీ వంటి రాజ్యాంగ బద్ధమైన సంస్థలను వినియోగించుకుంటోందని, తాజాగా.. గవర్నర్ వ్యవస్థను కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందనే విమర్శలకు తావిచ్చినట్టయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గవర్నర్ ఇచ్చిన గడువు ముగిసిన తరువాత.. అప్పటికీ శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోతే.. రాష్ట్రపతి పాలన దిశగా చర్యలు తీసుకుని ఉండొచ్చని, అలా కాకుండా తొందర పడటం వల్ల ప్రతికూల సంకేతాలను ప్రజల్లోకి పంపించినట్టయిందని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President’s rule was imposed in Maharashtra on Tuesday evening amid a stalemate over Government formation after the assembly polls last month. The Union Cabinet had earlier in the day recommended President’s rule in the State after Governor Bhagat Singh Koshyari submitted a report in this regard, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more