వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంపీపై కాంగ్రెస్-ఎన్సీపీ నేతల చర్చ, బ్లూ ప్రింట్ రెడీ చేసిన జైరాం రమేశ్..

|
Google Oneindia TeluguNews

చర్చోపచర్చల తర్వాత మహారాష్ట్రలో పొత్తు పొడవనుంది. శివసేనతో కలిసి కూటమి ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్-ఎన్సీపీ స్పష్టంచేశాయి. దీంతో ఢిల్లీలో ఎన్సీపీ శరద్ పవార్ నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కనీస ఉమ్మడి ప్రణాళికపై చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జైరాం రమేశ్, అహ్మద్ పటేల్, మల్లిఖార్జున ఖర్గే, పృథ్వీరాజ్ చౌహాన్, కేసీ వేణుగోపాల్, ఎన్ీసపీ నుంచి సుప్రియ సూలే, అజిత్ పవార్, జయంత్ పాటిల్, నవాబ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

 ఇదీ సీఎంపీ..?

ఇదీ సీఎంపీ..?

కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించే బాధ్యతను జైరాం రమేశ్‌కు అప్పగించినట్టు ప్రచారం జరుగుతుంది. సమావేశంలో కీలక నిర్ణయాలపై తుదిరూపం వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు కాంగ్రెస్-ఎన్సీపీ ఇచ్చిన ప్రధాన హామీల అమలు లక్ష్యంగా ఆయా పార్టీలు కలిసి పనిచేస్తాయి. పంట రుణమాపీ, పంట పెట్టుబడి పథకం తదితర అంశాలపై డిస్కష్ చేస్తారు.

సోనియా గ్రీన్ సిగ్నల్

సోనియా గ్రీన్ సిగ్నల్

అంతకుముందు శివసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేయడానికి సోనియాగాంధీ ఆమోదం తెలిపారని ఎన్సీపీ వర్గాలు ఓ ఆంగ్ల పత్రికకు తెలియజేశారు. సోమవారం సోనియాగాంధీతో శరద్ పవార్ సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై తొందరపడకుండా చర్చలు సంయమనంతో జరుగుతున్నాయని ఎన్సీపీ వర్గాలు తెలియజేశాయి.

ఫస్ట్ వీక్‌లో..

డిసెంబర్ మొదటివారంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సీఎం పదవీ, డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవులపై మాత్రం కాంగ్రెస్, ఎన్సీపీ స్ఫష్టతనివ్వలేదు. మంత్రి పదవులు మాత్రం సమానంగా పంచుకుంటామని ఆ పార్టీలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

రానీ మెజారిటీ

రానీ మెజారిటీ

గత నెలలో మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసాక, ఫలితాలను కూడా ప్రకటించారు. అయితే ఏ పార్టీ పూర్తి మద్దతు రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. బీజేపీ 105 సీట్ల మధ్య ఆగిపోవడం, శివసేన 50-50 ఫార్ములాను తెరపైకి తీసుకురావడంతో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై పీటముడి నెలకొంది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కూడా విధించిన సంగతి తెలిసిందే.

English summary
senior leaders of the Congress and the Nationalist Congress Party (NCP) held talks at the residence of NCP chief Sharad Pawar in New Delhi on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X