వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభను కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారం.. ఎంపీ ప్రశ్నించడంతో సభలో దుమారం..

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేసింది. 18 రోజుల వర్షకాల పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే.. బాలీవుడ్ డ్రగ్ అంశాన్ని ఓ ఎంపీ ప్రశ్నించారు. తర్వాత మిగతా సభ్యుల ప్రశ్నలతో సభలో గందరగోళం నెలకొంది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, కంగనా రనౌత్ కామెంట్స్ హాట్ హాట్ చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంతో లోక్ సభలో రగడ మొదలైంది.కరోనా వైరస్ విజృంభిస్తోన్న సందర్భంగా సేవలు అందించి ఆసువులు బాసిన వారికి స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. వైరస్ పారదోలేందుకు వారు తమ ప్రాణాలనే ఫణంగా పెట్టారని తెలిపారు.

Congress notice in Lok Sabha over Chinese incursion in Ladakh..

Recommended Video

షాకింగ్.. MP Sumalatha Ambareesh కు COVID-19 పాజిటివ్! || Oneindia Telugu

వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు, పోలీసులు, వాలంటరీ సిబ్బంది సేవలను స్పీకర్ కొనియాడారు. మరోవైపు ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ తూర్పు లడఖ్ వద్ద నెలకొన్న పరిస్థితిపై వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా నోటీసు ఇచ్చింది. లడాఖ్‌లో పరిస్థితిపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది.

స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా.. ప్రతి సభ్యుడికీ ఓ ప్రత్యేక బ్యాగ్ పంపారు. కరోనా బారిన పడకుండా తమకు తాము జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కిట్‌లను డీఆర్డీఓ రూపొందించాయి. ఒక్కో కిట్ లో 40 డిస్పోజబుల్ మాస్క్, ఐదు ఎన్-95 మాస్క్, ఒక్కొక్కటి 50 ఎంఎల్ పరిమాణం గల 20 శానిటైజర్ బాటిళ్లు, 40 జతల చేతి తొడుగులు, ఫేస్ షీల్డ్ లు, హెర్బల్ శానిటైజేషన్ వైప్స్ ఉన్నాయి. బ్యాగ్ ను తెరిచేందుకు, మూసేందుకు టచ్ ఫ్రీ హుక్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి కిట్‌లో రోగ నిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీ బ్యాగ్స్ కూడా జత చేశారు.

English summary
Lok Sabha Speaker Om Birla paid tributes to security personnel who have laid down their lives while protecting the nation since March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X