వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్మయానందను కాపాడటం కోసమే ఇదంతా ... యూపీ సర్కార్ తీరుపై కాంగ్రెస్ ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యాయశాస్త్ర విద్యార్ధిని అత్యాచారం కేసులో నిందితుడు, మాజీ కేంద్రమంత్రి చిన్మయానందను కాపాడేందుకు యూపీలోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. చిన్మయానందను కేసు నుండి తప్పించే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యు పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాజీ కేంద్ర మంత్రి చిన్మయానంద ను రక్షించారని ఆరోపిస్తూ బిజెపి ప్రభుత్వం పై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

మహిళలపై నేరాలు అరికట్టటంలో బీజేపీ సర్కార్ విఫలం అన్న ప్రియాంకా గాంధీ

మహిళలపై నేరాలు అరికట్టటంలో బీజేపీ సర్కార్ విఫలం అన్న ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ రాష్ట్రంలో మహిళలపై నేరాలను అరికట్టడానికి బిజెపి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నేరస్తులను రక్షించడం, ఫిర్యాదుదారులు బెదిరించడం బిజెపి నైజమని ఆమె మండిపడ్డారు. బిజెపి నాయకుడు చిన్మయానంద లా విద్యార్థిని పై అత్యాచారం చేశారని ఆరోపించారు . అంతే కాదు బ్లాక్ మెయిల్ చేస్తుందన్న ఫిర్యాదుతో విద్యార్థినిని అరెస్టు చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

చిన్మాయానందను తప్పించే కుట్ర ఇది అని మండిపాటు

చిన్మాయానందను తప్పించే కుట్ర ఇది అని మండిపాటు

చిన్మయానంద కేసులో న్యాయ విద్యార్థినిని సిట్ అరెస్ట్ చేసింది. మహిళలపై నేరాలను అరికట్టడానికి ఉత్తరప్రదేశ్ నుండి బిజెపి ప్రభుత్వం జీరో అని చెప్పాల్సి వస్తుంది అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు .అంతేకాదు మహిళలపై నేరాల గణాంకాలను చూసినట్లయితే యూపీలోని బిజెపి సర్కార్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ ను సైతం చేశారు. రాంపూర్ లో ని గన్ పాయింట్ వద్ద బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని నేరస్తులు ఆమె వీడియోను కూడా వైరల్ చేశారని పేర్కొన్నారు. ఇక చిన్న ఆనందు విషయంలో అత్యాచారం జరిగిందని ఆరోపించిన యువతికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

చిన్మయానందను బ్లాక్ మెయిల్ చేసిందని లా విద్యార్థిని అరెస్ట్ ..14 రోజుల రిమాండ్

చిన్మయానందను బ్లాక్ మెయిల్ చేసిందని లా విద్యార్థిని అరెస్ట్ ..14 రోజుల రిమాండ్

చిన్మయానంద లా విద్యార్థిని తనను బ్లాక్‌మెయిల్ చేస్తుందని కేసు నమోదు చేయడంతో విచారణ నిమిత్తం ఆమెను కూడ అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే అరెస్ట్ సంధర్భంలో బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారని కుటుంబం సభ్యులు మీడియాకు తెలిపారు. అరెస్ట్ అనంతరం ఆమెను విచారణ కోసం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడికి తీసుకున్నారు. ఇక ఆమె బెయిల్ పిటిషన్ సరిగ్గా లేని కారణంగా ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.

బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్

బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్

కాంగ్రెస్ నేత గిరి మాట్లాడుతూ ప్రజలందరి న్యాయం కోసం కోర్టులను నమ్ముతారు కానీ దాన్ని సైతం సర్కస్ గా మార్చాలి అనుకున్న వారిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అసహనం వ్యక్తం చేశారు. ఇక దీనిపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత రాజీవ్ రాగి యూపీలో నేరస్తులు రక్షించబడు తున్నారు అని, నేరస్తులను రక్షించే పని ప్రభుత్వం నిర్భయంగా చేస్తుందని పేర్కొన్నారు మహిళలపై నేరాల పెరగటం సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని, నేరస్థులకు యూపీ లోని బిజెపి ప్రభుత్వం అండగా నిలుస్తుందని త్యాగి విమర్శించారు. లా విద్యార్థిని అరెస్టు నేపథ్యంలో చిన్మయానంద ను తప్పించడం కోసమే ఇదంతా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.

English summary
Congress came down heavily on the BJP government in Uttar Pradesh, accusing Chief Minister Yogi Adityanath of protecting former Union minister Chinmayanand who has been accused of rape by a law student.Congress leader Priyanka Gandhi Vadra accused the BJP government of having scored a zero in stopping crime against women in the state and accused it of protecting criminals and intimidating complainants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X