వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలను రద్దుచేయాలని కాంగ్రెస్ డిమాండ్

గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకొంది. మంగళవారం నాడు జరిగిన రాజ్యసభ ఎన్నికలను రద్దుచేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాం

By Narsimha
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకొంది. మంగళవారం నాడు జరిగిన రాజ్యసభ ఎన్నికలను రద్దుచేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్ పోటీచేస్తున్నారు. అయితే బిజెపి మూడో అభ్యర్థిని రంగంలోకి దించడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

మంగళవారం నాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అనుమానాలను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది. అయితే గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ నిర్వహించింది.

congress party demands to cancel gujarat rajya sabha election

కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్‌పటేల్‌కు జెడియూ, ఎన్‌సిపీలు మద్దతు ఇస్తామని తొలుత ప్రకటించాయి. అయితే జెడియూ అభ్యర్థి బిజెపికి ఓటేస్తానని ప్రకటించి తన మాటలను నిలబెట్టుకొన్నట్టు చెప్పారు. ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ శరద్‌పవార్ ఆదేశించారు.

కానీ, ఓ ఎమ్మెల్యే మాత్రం పార్టీ చీఫ్ ఆదేశాలను ధిక్కరించారు. బిజెపికి ఓటుచేశారు. మరో ఎమ్మెల్యే కూడ బిజెపికే ఓటు చేసినట్టు సమాచారం అందుతోంది.

గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 మంది ఎమ్మెల్యేలున్నారు. 122 మంది ఎమ్మెల్యేలు బిజెపికి ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు శంకర్‌సింగ్‌వాఘేలా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని వీడారు.

ఆ తర్వాత కూడ మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కూడ పార్టీని వీడారు. అయితే 44 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. అయితే క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు కూడ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అనుమానాలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుమానిస్తోంది.

మరో వైపు కొందరు ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్లను బయటకు తెచ్చి ఓటుచేశారని ఈ ఓట్లను చెల్లనివిగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ వినతిని ఎన్నికల సంఘం తిరస్కరించింది.

అయితే ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాల గెలుపు ఖాయం. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్‌పటేల్ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచే అవకాశం ఉందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

ఈ ఎన్నికల్లో అనేక అక్రమాలు చోటుచేసుకొన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దరిమిలా ఈ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.

English summary
The BJP’s Amit Shah and Smriti Irani are set to be elected to the Rajya Sabha from Gujarat in polling on Tuesday, congress party candidate Patel remained confident of victory, saying that the “numbers favoured the Congress”, congress party demanded to EC cancel rajya sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X