ఉత్తర్ ప్రదేశ్ లో స్టార్ క్యాంపెయినర్లు, కాంగ్రెస్ జాబితాలో నగ్మాకుచోటు
న్యూఢిల్లీ :ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను దింపనుంది. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో కలిసి ఆ పార్టీ పోటీచేస్తోంది.పార్టీ సీనియర్లతో పాటు సినీ నటులను కూడ ఈ క్యాంపెయిన్ లో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోనుంది.
ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 105 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తోంది. మిగిలిన స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీకి మద్దతివ్వనుంది. ఈ రాష్ట్రంలో బిజెపిని నిలువరించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దింపుతోంది.
పార్టీ అధినేత్రి సోనియాగాందీ, మాజీ ప్రధాని మన్మోహన్ సహ, మాజీ ముఖ్యమంత్రులు,ప్రియాంక, రాహుల్ లతో పాటు పార్టీ సీనియర్లు, సినీ నటులు 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపనుంది.

తెలుగుతొ పాటు పలు భాష చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి నగ్మా కూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింధియా లాంటి నాయకులు కూడ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు.