వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైముంటే తప్పక చదవండి.. ప్రధాని మోదీకి స్పెషల్ గిఫ్ట్.. రిపబ్లిక్ డే సందర్భంగా పంపిన కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

71వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓ స్పెషల్ గిఫ్టు పంపింది. అమెజాన్ ద్వారా ఆదివారం నాటికి ప్రధాని కార్యాలయానికి డెలివరీ కావాల్సిన ఈ గిఫ్టుకు సంబంధించిన వివరాల్ని కాంగ్రెస్ వెల్లడించింది. అయితే 'క్యాష్ ఆన్ డెలివరీ' విధానంలో పంపిన ఆ 170 రూపాయల విలువగల వస్తువును ప్రధాని కార్యాలయం స్వీకరించిందా? తిప్పి పంపిందా? అనేది తెలియాల్సిఉంది.

ఇంతకీ ఏంటది?
''సార్.. దేశాన్ని విభజించే పనిలో మీరు చాలా బిజీగా ఉన్నారని తెలుసు.. అయితే ఏకొంచెం టైమ్ దొరికినా ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.. ఇది మన భారత రాజ్యాంగం.. మన వ్యవస్థలన్నీ పనిచేసేది దీనిపైనే..''అంటూ భారీ డైలాగులతో కాంగ్రెస్ పార్టీ మోదీకి పంపిన ఆ గిఫ్ట్ మరేదోకాదు.. భారత రాజ్యాంగం ప్రతి. యునీక్ వరల్డ్ ట్రెండ్స్ ప్రచురించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని మోడీకి గిఫ్ట్ గా పంపినట్లు కాంగ్రెస్ ఆదివారం ప్రకటించింది.

Congress party sends copy of Constitution to PM

ఆర్టికల్ 14కు విరుద్ధం..
మతం ఆధారంగా వ్యక్తులకు పౌరసత్వం కల్పించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని, ఈ కనీస పాఠాన్ని కూడా బీజేపీ నేర్చుకోలేకపోయిందని, కాబట్టే సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తోపాటు యావత్ దేశం ఆందోళనలను చేస్తున్నదని ఆ పార్టీ విమర్శించింది. గిఫ్ట్ ఫొటోలతోపాటు కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు రాజ్యాంగ పీఠిక చదువుతోన్న వీడియోలను కూడా పార్టీ ట్విటర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. కాంగ్రెస్ గిఫ్టుపై బీజేపీ స్పందించాల్సిఉంది.

English summary
On the occasion of the 71st Republic Day, the Congress on Sunday sent a copy of the Constitution to Prime Minister Narendra Modi and took a dig at him saying, "when you get time off from dividing the country, please do read it".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X