వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో మనీ.. బట్ హౌ: కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలంటేనే డబ్బులతో ముడిపడిన అంశం. ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే చాలు.. ఎన్నికల సంఘం నగదు బదిలీలపై ఇతర ఆర్థిక అంశాలపై గట్టి నిఘా పెడుతుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కొన్ని వందల కోట్లు డబ్బులు పోలీసులు పట్టుకున్న ఘటనలు కూడా చూశాం. ఇక ఆయా పార్టీలు కూడా ఒక పరిమితి వరకే డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందనే నిబంధనలు ఉన్నాయి. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖర్చు చేసిన డబ్బులు తెలిస్తే షాక్ అవుతారు.

Maharashtra Politics:జైపూర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..క్యాంపు రాజకీయాలు ప్రారంభంMaharashtra Politics:జైపూర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..క్యాంపు రాజకీయాలు ప్రారంభం

కాంగ్రెస్ ఖర్చు చూస్తూ మైండ్ బ్లాక్ అవుతుంది

కాంగ్రెస్ ఖర్చు చూస్తూ మైండ్ బ్లాక్ అవుతుంది

2019 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్షరాల రూ.820 కోట్లు ఖర్చు చేసింది. డబ్బులు లేవని చెబుతూనే ఇంత స్థాయిలో ఖర్చు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చేసిన ఖర్చు రూ.516 కోట్లు ఉండగా ఈ సారి ఆ మార్క్‌ను దాటి ఏకంగా రూ.820 కోట్లు ఖర్చు చేసింది. ఇక బీజేపీ 2014 ఎన్నికల ఖర్చు రూ.714 కోట్లు ఉండగా 2019కి సంబంధించిన ఖర్చుల వివరాలు ఇంకా సబ్మిట్ చేయాల్సి ఉంది.

ఈసీకి ఖర్చు వివరాలు తెలిపిన కాంగ్రెస్

ఈసీకి ఖర్చు వివరాలు తెలిపిన కాంగ్రెస్


ఎన్నికల సంఘానికి ఎన్నికల ఖర్చు వివరాలను కాంగ్రెస్ సబ్మిట్ చేసింది. అక్టోబర్ 31న సబ్మిట్ చేసిన రిపోర్టులో పార్టీ ప్రచారానికి రూ.626.3 కోట్లు ఖర్చు చేయగా.. అభ్యర్థుల ఖర్చుల కోసం 193.9 కోట్లు వెచ్చించినట్లు రిపోర్టులో పేర్కొంది. ఎన్నికల సందర్భంగా, అంటే ఎన్నికల తేదీలు ఈసీ ప్రకటించిన నాటినుంచి ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీ రూ.856 కోట్లు ఖర్చు చేసినట్లు రసీదులు ఇచ్చింది. ఇక ఇతర పార్టీలు కూడా తమ ఎన్నికల ఖర్చుల వివరాలు పొందుపర్చాయి. అందులో తృణమూల్ కాంగ్రెస్ రూ.83.6 కోట్లు ఖర్చుచేయగా... బీఎస్పీ రూ. 55.4 కోట్లు, ఎన్సీపీ రూ. 72.3 కోట్లు సీపీఎం రూ.73.1 లక్షను ఖర్చు చేసినట్లుగా ఈసీకి వెల్లడించిన నివేదిక ద్వారా తెలిపాయి.

 డబ్బులు లేవన్నారు.. మరి ఇంత ఖర్చు హౌ..?

డబ్బులు లేవన్నారు.. మరి ఇంత ఖర్చు హౌ..?

ఇదిలా ఉంటే ఈ ఏడాది మేలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా ఉన్న దివ్యస్పందన తమ దగ్గర డబ్బులు లేవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ బాండ్ల ద్వారా డబ్బులు సమకూరలేదని చెప్పారు.దీంతో ఆన్‌లైన్ ద్వారా నిధులు సేకరణ జరిగిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ దగ్గర నిధులు లేవని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నేత శశిథరూర్ కూడా ట్వీట్ చేశారు. ఇక పబ్లిసిటీ కోసం రూ. 626.36 కోట్లు ఖర్చు చేస్తే అందులో రూ.573 కోట్లు చెక్ రూపంలో ఇవ్వడం జరిగిందని నివేదికలో తెలిపింది. రూ.14.33 కోట్లు క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగిందని వెల్లడించింది. ఇక పార్టీ హెడ్‌క్వార్టర్స్ రూ.356కోట్లను పబ్లిసిటీ, ఇతర అడ్వర్టైజ్‌మెంట్లకు ఖర్చు చేసిందని వెల్లడించింది.

 పోస్టర్ల నుంచి స్టార్ క్యాంపెయినర్ల వరకు చేసిన ఖర్చు..

పోస్టర్ల నుంచి స్టార్ క్యాంపెయినర్ల వరకు చేసిన ఖర్చు..

పోస్టర్లకు పోల్ మెటీరియల్‌కు రూ.47 కోట్లు ఖర్చుచేసినట్లు కాంగ్రెస్ పొందుపర్చింది. స్టార్ క్యాంపెయినర్ల కోసం వారి ప్రయాణాల కోసం రూ.86.82 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించింది. ఇక రాష్ట్రాలవారీగా చూసుకుంటే ఛత్తీస్‌గఢ్‌ ఒడిషాలలో కలిపి రూ.40 కోట్లు ఖర్చు చేయగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ. 36 కోట్లు, మహారాష్ట్రలో రూ.18 కోట్లు ఖర్చుచేసినట్లు కాంగ్రెస్ లెక్కలు చూపించింది. పశ్చిమ బెంగాల్‌లో రూ.15 కోట్లు ఖర్చు చేయగా.. కేరళలో రూ.13 కోట్లు ఖర్చు చేసినట్లు అకౌంట్స్ చూపించింది హస్తం పార్టీ.

English summary
In a mindblowing expenditure the grand old party congress had spent Rs 820 crore in 2019 elections. This was said in a report that the party submitted to election commission on Poll expenditure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X