వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాది కే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు..! టాప్ లో ఉన్న సౌత్ నేతల పేర్లు..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : రాహుల్ గాంధీ తర్వాత ఏఐసిసి అద్యక్షపదవిని ఎవరు చేపడతారనేది కాంగ్రెస్ అదిష్టానాన్ని వేధిస్తోన్న ప్రశ్న. ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాహుల్ గాంధీ విముఖత చూపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది చర్చనీయాశంగా మారింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను బాధ్యతాయుతంగా ఎవరూ మోయగలరంటూ క్షేత్రస్థాయిలో కసరత్తు సాగుతోంది. కాంగ్రెస్ నేతలంతా తమ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనేందుకు దక్షిణాది వైపే మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దక్షిణాది నుంచి కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతల పేర్లను పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు అధ్యక్షుడి జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ, ఆ కాంగ్రెస్ నేతలు ఎవరూ అనేది ఇంకా ఖరారు చేయలేదు.

ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ విముఖత..! అద్య క్ష పదవికి పోటీ పడుతున్న సత్ నేతలు..!!

ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ విముఖత..! అద్య క్ష పదవికి పోటీ పడుతున్న సత్ నేతలు..!!

మరోవైపు ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మోహన్ మార్కమ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఏఐసీసీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే మార్కమ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారాయి. రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక వాయ్ నాడ్ స్థానంలో మాత్రమే గెలిచారు. అమేథీలో రాహుల్ స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఈ పరిణామ క్రమంలో రాహుల్.. పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. అయినప్పటికీ రాహుల్ నిర్ణయాన్ని పార్టీ కేడర్ అంగీకరించలేదు.

రాజీనామా దీశగా రాహుల్ నిర్ణయం..! వద్దంటున్న నేతలు..!!

రాజీనామా దీశగా రాహుల్ నిర్ణయం..! వద్దంటున్న నేతలు..!!

కొన్నిరోజులుగా పార్టీ సమావేశాల్లో కూడా రాహుల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు విముఖత చూపించారు. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరూ ఎన్నికైనా.. రాహుల్ పార్టీ పరంగా బాధ్యతలను స్వేచ్ఛగా కొనసాగిస్తారని కాంగ్రెస్ నేత తరుణ్ గగోయ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వాయ్ నాడ్ లోక్ సభ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. మరో వైపు ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 140మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.

 అద్యక్ష పదవిలో రాహుల్ కొసాగాలంటున్న నేతలు..! దేశ వ్యాప్తంగా సూచనలు..!!

అద్యక్ష పదవిలో రాహుల్ కొసాగాలంటున్న నేతలు..! దేశ వ్యాప్తంగా సూచనలు..!!

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటిమికి బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశారు. పీసీసీ, ఏఐసీసీ పదవులకు నేతలు రాజీనామా చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి కూడా పొన్నం ప్రభాకర్ తప్పుకున్నారు.రాజీనామా చేసినవారిలో పీసీసీ, ఏఐసీసీ అనుబంధ సంఘాల సభ్యులు ఉన్నారు. హర్యాణా వర్కింగ్ ప్రెసిడెంట్, ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.

 రాహుల్ నిర్ణయాన్ని మార్చుకోవాలి..! ఊపందుకుంటున్న నేతల రాజీనామాలు..!!

రాహుల్ నిర్ణయాన్ని మార్చుకోవాలి..! ఊపందుకుంటున్న నేతల రాజీనామాలు..!!

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్‌ అనుబంధ కమిటీల నేతలంతా ఢిల్లీలో సమావేశమై.. జులై 2వ తేదీ లోపు రాహుల్‌ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే అన్నీ స్థాయిల్లోని నేతలు తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజీనామాలు చేసి ఏఐసీసీ వద్ద ఆందోళన చేపట్టాలని భావిస్తున్నారు.

English summary
Rahul Gandhi's reluctance to continue as AICC president has become controversial as to who will be the new president of the Congress party. There is a lot of fieldwork that no one can responsibly carry the reins of Congress across the country. Party sources have revealed that all the Congress leaders are in the South to elect their party president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X