వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకను లూటీ చెయ్యడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్లాన్, జాగ్రత్త: రాహుల్ గాంధీ ఫైర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీఎం సిద్దరామయ్యకు సూచించారు. ఎన్నికల ప్రచారం చెయ్యడానికి గురువారం కర్ణాటక చేరుకున్న రాహుల్ గాంధీ రోడ్ షోలు, సభలు, సమావేశాలతో బిజీబిజీగా గడిపారు.
కర్ణాటకను ప్రధాని నరేంద్ర మోడీ లూటీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, కన్నడిగులు జాగ్రత్తగా ఉండాలని రాహుల్ గాంధీ అన్నారు.

హుబ్బళిలో ఘన స్వాగతం

హుబ్బళిలో ఘన స్వాగతం

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం హుబ్బళి చేరుకున్న రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాహుల్ గాంధీ, సీఎం సిద్దరామయ్య, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్, విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ప్రత్యేక హెలికాప్టర్ లో ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలకు బయలుదేరి వెళ్లారు.

రాహుల్ గాంధీ ఆనందం

రాహుల్ గాంధీ ఆనందం

రాహుల్ గాంధీ రోడ్ షోలకు ఊహించినదాని కంటే కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావడంతో రాహుల్ గాంధీ ఆనందానికి హద్దేలేకుండాపోయింది. సీఎం సిద్దరామయ్య, సీనియర్ మంత్రి ఆర్ వీ. దేశ్ పాండేతో కలిసి రాహుల్ గాంధీ రోడ్ షోలో ఉత్సహాంగా పాల్గొన్నారు.

కుమటాలో రాహుల్ గాంధీ

కుమటాలో రాహుల్ గాంధీ

ఆంకోలలో రోడ్ షో, స్థానిక నాయకులతో భేటీ అనంతరం రాహుల్ గాంధీ కుమటాకు బయలుదేరి వెళ్లారు. కుముటాలో రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు.

కర్ణాటక లూటీకి మోడీ ప్లాన్

కర్ణాటక లూటీకి మోడీ ప్లాన్

కర్ణాటకలోని బీజేపీకి చెందిన అవినీతి నాయకులు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ వారిని అడ్డంపెట్టుకుని కర్ణాటకను లూటీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కన్నడిగులు జాగ్రత్త

కన్నడిగులు జాగ్రత్త

గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ప్రభుత్వం, ప్రజల సొత్తును లూటీ చేశారని, ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బసవన్న తత్వాలు పాటించే కన్నడిగులు చాల మంచి వారని, వారు బీజేపీకి ఓటు వెయ్యరని, కన్నడిగులు జాగ్రత్తగా ఉండాలని రాహుల్ గాంధీ అన్నారు.

English summary
Karnataka assembly elections 2018: Congress president Rahul Gandhi conducted road show in Ankola of Uttara Kannada district with state congress leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X