• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్ మేనిఫెస్టోలో 'డేటింగ్ డెస్టినేషన్స్'.. యూత్‌కు బంపరాఫర్.. 'లవ్ జిహాద్' అంటున్న బీజేపీ...

|

ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు తాయిలాలు,జనాకర్షక పథకాలు ప్రకటించడం కామన్. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. ఈరోజుల్లో యువతకు ప్రైవసీ కరువైందని.. కలిసి మాట్లాడుకునేందుకు చోటే లేదని... కాబట్టి వారికోసం కాఫీ షాప్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. వడోదరా మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపరిచింది. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీపై బీజేపీ భగ్గుమంటోంది. ఇది లవ్ జిహాద్‌ను ప్రోత్సహించడమేనని విమర్శిస్తోంది.

యువత డేటింగ్ కోసం కాఫీ షాప్స్...

యువత డేటింగ్ కోసం కాఫీ షాప్స్...

'కాఫీ షాప్స్,కేఫ్‌లకు వెళ్లడం ఈరోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మధ్యతరగతి,దిగువ మధ్య తరగతి ప్రజలు ఆ ఖర్చులను భరించలేరు. ఇప్పుడున్న 21వ శతాబ్దంలో మన యువత ఏ భయం లేకుండా కూర్చొని ప్రైవేట్ క్షణాలను ఆస్వాదించగల సంస్కృతిని ప్రోత్సహించాలి.' అని వడోదరా కాంగ్రెస్ నేత ప్రశాంత్ పటేల్ పేర్కొన్నారు. యువత కాంగ్రెస్‌కు ఓటు వేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే నగరంలో కాఫీ షాప్స్,కేఫ్స్ నిర్మిస్తామని చెప్పారు. తద్వారా స్థానికులకు ఉపాధి కూడా దొరుకుతుందన్నారు.

మహిళలకు క్లబ్ హౌస్‌లు...

మహిళలకు క్లబ్ హౌస్‌లు...

కాఫీ షాప్స్,కేఫ్స్ మాత్రమే కాదు మహిళలు కిట్టీ పార్టీలు చేసుకునేందుకు క్లబ్ హౌస్‌లను కూడా నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే ఉచిత విద్యను అందించే,ఇంగ్లీష్ మీడియంలో బోధించే అత్యాధునిక స్కూళ్లను ప్రతీ జోన్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపింది. తద్వారా స్కూల్ డ్రాపౌట్స్ సంఖ్య తగ్గుతుందని పేర్కొంది. నగరంలో ఆస్తి పన్నును కూడా తగ్గిస్తామని... ఆరోగ్యపరంగా మెరుగైన సదుపాయాలు,వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

భగ్గుమన్న బీజేపీ...

భగ్గుమన్న బీజేపీ...

మరోవైపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఇటాలియన్ సంస్కృతి ప్రభావం కనిపిస్తోందంటూ ఎద్దేవా చేసింది. ఇలాంటి హామీలు వడోదరా ప్రజలను కించపరచడమేనని పేర్కొంది. అంతేకాదు,ఇటువంటి హామీలు లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తాయని... దీనికి తాము వ్యతిరేకమని వడోదరా బీజేపీ అధ్యక్షుడు విజయ్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి భారతీయ సమాజపు విలువల పట్ల ఏమాత్రం గౌరవం లేదని... కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ఆలోచన లేని హామీలు ఇస్తున్నారని వడోదరా బీజేపీ జనరల్ సెక్రటరీ సునీల్ సోలంకి మండిపడ్డారు.

యువతి విజ్ఞప్తి మేరకే అంటున్న కాంగ్రెస్..

యువతి విజ్ఞప్తి మేరకే అంటున్న కాంగ్రెస్..

బీజేపీ విమర్శలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. డేటింగ్ డెస్టినేషన్స్ కోసం యువత నుంచే తమకు విజ్ఞప్తులు అందాయని పేర్కొనడం గమనార్హం. ఇటీవల నిర్వహించిన హలో గుజరాత్ క్యాంపెయిన్ సందర్భంగా చాలామంది యుత... కేఫ్‌ల గురించి ప్రస్తావించారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈరోజుల్లో కేఫ్‌లకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయిందని... ఉమ్మడి కుటుంబాల్లో భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం కూడా దొరకట్లేదని అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే వడోదరా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిచే కాఫీ షాప్స్ ఏర్పాటుకు హామీ ఇచ్చామన్నారు. కాగా,ఈ నెల 21న వడోదరా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.

English summary
Young voters of Vadodara city have received an attractive election promise from the opposition Congress for civic body elections. To attract young voters Congress in its manifesto, which was released on Tuesday, has promised to set up coffee shops for youngsters from the middle class and lower-middle-class backgrounds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X