వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్ స్పీకర్‌‌పై ఆర్టికల్179 సీ కింద కాంగ్రెస్ నోటీసులు,అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌కు వినతి

|
Google Oneindia TeluguNews

మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామా సహా ఎన్పీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో బీరెన్ సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని గుర్తుచేస్తోంది. గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కలిసి వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని కోరింది. బీరెన్ సింగ్ ప్రభుత్వం విశ్వాసం నిరూపించుకోవాలని, లేదంటే గద్దెదిగాలని కోరింది.

స్పీకర్‌కు నోటీసులు

స్పీకర్‌కు నోటీసులు

స్పీకర్ వై ఖేమ్‌చంద్‌ను తొలగించాలని కోరింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీచేసింది. స్పీకర్ పదవీలో ఉంటూ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కే మేఘచంద్ర మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు అందజేశారు. మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్టికల్ 179 సీ కింద నోటీసు ఇచ్చినట్టు పేర్కొన్నది. ఆర్టికల్ 179 సీ కింద స్పీకర్/డిప్యూటీ స్పీకర్‌ను మెజార్టీ సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టి, ఆమోదిస్తే తొలగించొచ్చు అని పేర్కొన్నారు. నోటీసును 10 మంది సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం వై జోయ్ కుమార్ సింగ్ కూడా బలపరిచారు.

రాత్రికి రాత్రే

రాత్రికి రాత్రే


ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటిస్తామని ప్రకటించారు. ఈ నెల 22వ తేదీన నిర్ణయం తీసుకుంటామని తొలుత చెప్పారు. కానీ తర్వాత గురువారం రోజునే నిర్ణయం తెలియజేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందుకు గల సహేతుక కారణం తెలియజేయలేదు. దాంతోపాటు తేదీని మార్చడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ వ్యవహారశైలి ఏంటో అర్థమైందని.. అందుకోసమే నోటీసు తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరారని సీఎల్పీ నేత ఓక్రామ్ ఇబోబి సింగ్ తెలిపారు. అసెంబ్లీని ఏర్పాటు చేసి.. బలనిరూపణ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

సంకీర్ణంలో ముసలం

సంకీర్ణంలో ముసలం

2017లో మణిపూర్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెల్చుకుని అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ 21 సీట్లు సాధించింది. అయితే మొత్తం 60 సీట్లున్న మణిపూర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 31 ఉండగా రెండు జాతీయ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో నేషనల్ పీపుల్ పార్టీ, నాగా పీపుల్ ఫ్రంట్ మరియు లోక్‌జనశక్తి పార్టీలు మద్దతు తెలపడంతో బీజేపీ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్ పీపుల్ పార్టీ, నాగా పీపుల్ ఫ్రంట్‌కు చెరో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా లోక్‌జనశక్తి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఇక ఒక స్వతంత్ర అభ్యర్థి, టీఎంసీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో బీజేపీ అధికారం చేపట్టింది. బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Recommended Video

Rahul Gandhi Birthaday : పేదలకు సహాయం చేయడమే అసలైన పుట్టిన రోజు వేడుక !
23 సీట్లతో మైనార్టీలో..

23 సీట్లతో మైనార్టీలో..


నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. టీఎంసీ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర అభ్యర్థి కూడా తన సపోర్ట్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు చెప్పడంతో బీరేన్ సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేక జెండా ఎగురవేస్తూ రాజీనామాలు చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం 23 సీట్లతో మైనార్టీలో పడిపోయింది.

English summary
Congress party Thursday approached Governor Najma Heptulla, to call a special Assembly session for a no-confidence motion against the N Biren Singh-led government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X