వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాపై ధిక్కారం: మళ్లీ ఫైరైన కపిల్ - బీజేపీని వదిలేసి, సొంతవాళ్లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా?

|
Google Oneindia TeluguNews

జాతీయ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. సమర్థవంతుడైన నాయకుణ్ని ఫుల్ టైమ్ అధ్యక్షుడిగా నియమించాలంటూ 23మంది నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన వ్యవహారంపై దుమారం పెద్దదైంది. సోనియాపై ధిక్కార పతాకగా అభివర్ణిస్తోన్న ఈ ఉదంతంలో సీనియర్ నేత కపిల్ సిబల్ మరోసారి అధిష్టానంపై నిప్పులు చెరిగారు.

చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్‌కు సమీపంగా.చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్‌కు సమీపంగా.

ఆ 23 మంది టార్గెట్..

ఆ 23 మంది టార్గెట్..

పార్టీలో నాయకత్వ మార్పు, సంస్థాగత ప్రక్షాళన చేపట్టాలంటూ సోనియాకు లేఖ రాసిన 23 మంది సీనియర్లను టార్గెట్ చేస్తూ పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లేఖ రాసిన 23 మందిలో ఒకరైన జితిన్ ప్రసాద(కేంద్ర మాజీ మంత్రి)పై చర్యలకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ శాఖల్లో అధికారికంగా తీర్మానం చేయడం సంచలనంగా మారింది.

 గాంధీ కుటుంబంపై గౌరవం లేదా?

గాంధీ కుటుంబంపై గౌరవం లేదా?

గాంధీ కుటుంబం పట్ల జితిన్ ప్రసాద కుటుంబానికి విశ్వాసం లేదని, గతంలో జితిన్ ప్రసాద తండ్రి జితేంద్ర ప్రసాద కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం సోనియా గాంధీపైనే పోటీకి నిలబడ్డారని, ఇప్పుడు జితిన్ సైతం తండ్రి బాటలోనే సోనియాపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారని, అందుకే ఆయనను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ లఖింపూర్ ఖేరీ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జితిన్ ప్రసాదపై పార్టీ విభాగం తీర్మానం చేయడాన్ని కపిల్ సిబల్ తీవ్రంగా తప్పుపట్టారు.

 సొంతవాళ్లపైనే దాడులా?

సొంతవాళ్లపైనే దాడులా?

‘‘ఇది చాలా దురదృష్టకర పరిణామం. జితిన్ ప్రసాద లాంటి నేతలను టార్గెట్ చేయడం సరైందికాదు. అయినా, ప్రత్యర్థి బీజేపీని వదిలేసి, కాంగ్రెస్ తన సొంత నాయకులపైనే సర్జికల్ స్ట్రైక్ చేస్తుండటం విచారకరం'' అని కపిల్ సిబల్ గురువారం ట్వీట్ చేశారు. సిబల్ తోపాటు లేఖపై సంతకం చేసిన మరో నేత మనీశ్ తివారీ(ఎంపీ) సైతం జితిన్ ప్రసాదపై కాంగ్రెస్ జిల్లా కమిటీ తీర్మానంపై స్పందించారు. సిబల్ ట్వీట్ ను రీట్వీట్ చేయడం ద్వారా తివారీ తన అసమ్మతిని తెలియజేశారు.

Recommended Video

Congress President: గాంధీయేతర వ్యక్తికే పగ్గాలు ఖాయమా? Rahul Gandhi, Priyanka Gandhi అనాసక్తి
నాయకత్వ సంక్షోభం ముగిసేదెన్నడు?

నాయకత్వ సంక్షోభం ముగిసేదెన్నడు?

2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఫుల్ టైమ్ సారధి లేకుండానే కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. తాత్కాలిక చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీ.. కొత్త నాయకుణ్ని ఎన్నుకునే వరకే తానా పోస్టులో ఉంటానని గతంలోనూ స్పష్టం చేశారు. కొత్త నాయుడి ఎంపికనే ప్రధాన అజెండాగా సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయింది. కానీ అంతకు కొద్ది గంటల ముందే 23 మంది సీనియర్లు సోనియా గాంధీకి ఘాటు లేఖ రాయడం చర్చకు దారితీసింది. లేఖపై గందరగోళం చెలరేగడంతో కొత్త లీడర్ ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. తాత్కాలిక చీఫ్ గా సోనియా గాంధీనే కొనసాగుతారని, ఆరు నెలలలోపు కొత్త నాయకుడి ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఏఐసీసీ వర్గాలు ప్రకటించాయి.

 ఒక వర్గాన్నే టార్గెట్ చేస్తే గందరగోళం - మొహర్రంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు - ఊరేగింపులకు నో ఒక వర్గాన్నే టార్గెట్ చేస్తే గందరగోళం - మొహర్రంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు - ఊరేగింపులకు నో

English summary
Senior Congress leader Kapil Sibal, a key member of 'Group of 23' that has sought an urgent organisational overhaul, on Thursday said it was "unfortunate" that the party was targetting its own member Jitin Prasada when it needed to target the ruling BJP with "surgical strikes"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X