వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు చేతకాక, మాపై నిందలా: బీహార్ ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

పాట్నా/హైదరాబాద్: ఏఐఎంఐఎం పార్టీ తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుష్పమ్ ప్రియకు షాక్: బీహార్ సీఎం అవుదామనుకుంటే డిపాజిట్ గల్లంతు, నోటాకే ఎక్కువ ఓట్లుపుష్పమ్ ప్రియకు షాక్: బీహార్ సీఎం అవుదామనుకుంటే డిపాజిట్ గల్లంతు, నోటాకే ఎక్కువ ఓట్లు

కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు..

కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు..

కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీపై విమర్శలు చేస్తోందని అసదుద్దీన్ మండిపడ్డారు. తమ పార్టీ ఓట్లను చీల్చేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తోందని కాంగ్రెస్ విమర్శించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీని నిందిస్తోందని అన్నారు. ఎప్పటిలాగే కాంగ్రెస్ ఇప్పుడు కూడా తన అరుపులు కొనసాగిస్తోందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.

ఎంఐఎం గెలుపు కాంగ్రెస్‌కు కనువిప్పు కావాలి..

ఎంఐఎం గెలుపు కాంగ్రెస్‌కు కనువిప్పు కావాలి..


బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఆ పార్టీలోని కొందరు ఇప్పటికే అంగీకరిస్తున్నారని అన్నారు. ఎంఐఎం పార్టీ విజయాలు ఆ పార్టీకి కనువిప్పు కావాలని హితవు పలికారు. తమ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయగా.. ఐదు స్థానాల్లో గెలుపొందిందని అన్నారు. కాగా, ఆ ప్రాంతంలో ఆర్జేడీ-కాంగ్రెస్ మహాఘఠబంధన్ కూటమి 9 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీఏ కూటమికి ఆరు స్థానాలు దక్కాయి.

ఎన్డీఏ గెలిచిన సీట్లలో.. ఎంఐఎం ఓట్ల కంటే గెలుపు మార్జినే ఎక్కువ

‘ఎన్డీఏ గెలిచిన సీట్లలో.. మా ఓట్ల కంటే గెలుపు మార్జిన్ ఎక్కువగా ఉంది. మా అభ్యర్థితో సంబంధం లేకుండా ఎన్డీఏ గెలిచింది. మరో మాటలో చెప్పాలంటే, ఈ సీట్లపై ఎన్డీఏను ఓడించడంలో మహాగత్బంధన్ విఫలమైంది, షేర్‌ఘాటిలో, ఆర్జెడి అతివాది దుర్గా వాహిని నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టింది. కానీ, గెలిచింది. ఇది రాడికలైజేషన్, 'ఓటు కట్టర్లు' గురించి ఏమి చెబుతుంది?’ అని అసుదుద్దీన్ ఓవైసీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సై అంటున్న ఓవైసీ

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సై అంటున్న ఓవైసీ

గత సంవత్సరం బీహార్‌లో ఒక స్థానానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసిన తొలిసారి గెలిచిన ఎంఐఎం పార్టీ.. తాజా అసెంబ్లీ ఎన్నికలో ఊహించని విధంగా 5 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ విజయాలతో త్వరలో జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రకటించారు. కాగా, 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టేందుకు తగిన మెజార్టీని సాధించగా, ఆర్జేడీ మహాకూటమి 110 స్థానాలకే పరిమితమైంది. కాగా, కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లోనే గెలుపొందడం గమనార్హం. కాంగ్రెస్ కారణంగానే మహాకూటమికి అధికారం దూరమైందనే విమర్శలు కూడా వినిపిస్తుండటం గమనార్హం.

English summary
Aday after his party scripted history winning five seats in the Bihar assembly election, AIMIM chief and Hyderabad MP Asaduddin Owaisi has hit out at the Congress for trying to deflect blame on his party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X