వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపులు, కాంగ్రెస్ లీడర్ అరెస్టు. మాజీ ఎం, నటి రమ్య క్లారిటీ. 39 మంది!

|
Google Oneindia TeluguNews

Recommended Video

లైంగిక వేధింపులతో కాంగ్రెస్ లీడర్ అరెస్టు, క్లారిటీ ఇచ్చిన నటి రమ్య

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) సోషల్ మీడియా సెల్ విభాగంలో మహిళా సిబ్బంది మీద లైంగిక వేధింపులు జరిగాయని వెలుగు చూడటంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ పార్టీ నాయకుడిని అరెస్టు చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, మాజీ ఎంపీ, నటి రమ్య అలియాస్ దివ్యా స్పందన వివరణ ఇచ్చారు.

ఏఐసీసీ మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేదింపుల ఫిర్యాదుపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రత్యేక కమిటీ విచారణ చేస్తోందని ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, నటి రమ్య ట్వీట్ చేశారు. గతంలో ఏఐసీసీ సోషల్ మీడియాలో పని చేసిన మహిళ తన మీద లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించారు.

Congress social media team member arrested for sexual harassment in Delhi

మాజీ ఉద్యోగిని చేసిన ఫిర్యాదుపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపిస్తున్నారని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిఫ్టానం తగిన చర్యలు తీసుకుంటుందని నటి రమ్య సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. అయితే జులై మొదటి వారంలో రమ్య మరో విదంగా స్పందించారు.

ఏఐసీసీ సోషల్ మీడియాలో పని చేసిన మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని నటి రమ్య వివరణ ఇచ్చారు. లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐసీసీ సోషల్ మీడియా ఉద్యోగి చిరాక్ పట్నాయక్ చాల మంచి వ్యక్తి అని 39 ఉద్యోగులు సంతకాలు చేసి అధిష్టానానికి ఇచ్చారని రమ్య జులై మొదటి వారంలో వివరణ ఇచ్చారు.

ఏఐసీసీ సోషల్ మీడియా టీంలో పని చేస్తున్న చిరాగ్ పట్నాయక్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని అక్కడే పని చేసిన మహిళ ఆరోపించారు. ఈ విషయంపై అప్పట్లో సోషల్ మీడియా ఇన్ చార్జ్ రమ్యకు ఫిర్యాదు చేసినా ఆమె పట్టించుకోలేదని మాజీ మహిళా ఉద్యోగి ఆరోపించారు.

విదిలేని పరిస్థితుల్లో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీసులు చిరాగ్ పట్నాయక్ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవల చిరాగ్ పట్నాయక్ కు బెయిల్ రావడంతో ఏఐసీసీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ రమ్య చిరాగ్ పట్నాయక్ విషయంలో స్పందించారు.

English summary
A Congress social media team member, Chirag Patnaik, was arrested in Delhi on Monday for allegedly sexually harassing a former colleague. He was released on bail soon after.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X