వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నేత హఠాన్మరణం... టీవీ డిబేట్‌లో పాల్గొన్న కొద్ది గంటలకే....

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజీవ్ త్యాగి హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో బుధవారం(అగస్టు 12) ఘజియాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. సాయంత్రం 5గంటలకు హిందీ న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన... ఆ తర్వాత కొద్ది గంటలకే కన్నుమూయడం చాలామందిని షాక్‌కి గురిచేసింది. ఆయన మృతికి కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది.

'రాజీవ్ త్యాగి హఠాన్మరణం పట్ల మేము తీవ్రం విచారం వ్యక్తం చేస్తున్నాం. నిబద్దత కలిగిన కాంగ్రెస్ నాయకుడు,నిజమైన దేశభక్తుడిని కోల్పోయాం. ఈ కష్టకాలంలో మన ఆలోచనలు,ప్రార్థనలు ఆయన కుటుంబానికి స్థైర్యాన్ని ఇవ్వాలి.' అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

తూర్పు ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ... రాజీవ్ త్యాగి హఠాన్మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన స్థానం భర్తీ చేయలేనిది అన్నారు. ఆయన భావజాల నిబద్దత కలిగిన నిజమైన వారియర్ అని కొనియాడారు.

Congress spokesperson Rajiv Tyagi passes away due to cardiac arrest

Recommended Video

ముఖ్యమంత్రి మేలుకో పేదల బతుకును ఆదుకో నినాదంతో తెరాస ప్రభుత్వం తీరుపై అఖిల పక్షం నిరసన !!

బీజేపీ నేత సంబిత్ పాత్రా త్యాగి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'త్యాగి ఇక లేరంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఆజ్‌తక్ న్యూస్ చానెల్‌లో సాయంత్రం 5గం. సమయంలో ఇద్దరం టీవీ డిబేట్‌లో పాల్గొన్నాం.' అని చెప్పుకొచ్చారు. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా రాజీవ్ త్యాగి మరణం పట్ల సంతాపం ప్రకటించారు. రాజీవ్ త్యాగి ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా,ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

English summary
Congress’ national spokesperson Rajiv Tyagi, who was a popular face in TV prime time debates, passed away Wednesday due to cardiac arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X