వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో ఆ పార్టీ పనైపోయింది..కాల్షియం ఇంజెక్షన్ ఇచ్చినా కోలుకోలేదు: ఓవైసీ

|
Google Oneindia TeluguNews

పూణే: కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు కోలుకోవడం అసాధ్యమన్న ఓవైసీ... కాల్షియం ఇంజెక్షన్ ఇచ్చినా కూడా తిరిగి గాడిన పడటం సాధ్యం కాదన్నారు. అక్టోబర్ 21న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పూణేలో ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు అసదుద్దీన్. మహారాష్ట్ర హర్యానాలో జరిగబోయే ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం విస్మరించిందని మండిపడ్డారు.

ఈ దేశానికి మైనారిటీల కంటే ఎలుకలతోనే అధిక ప్రమాదం: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలుఈ దేశానికి మైనారిటీల కంటే ఎలుకలతోనే అధిక ప్రమాదం: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

దేశరాజకీయ చిత్రం నుంచి కాంగ్రెస్ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయిందని కామెంట్ చేశారు అసదుద్దీన్. ఇక బీజేపీని కూడా టార్గెట్ చేస్తూ ప్రసంగించారు అసదుద్దీన్. హిమాచల్ ప్రదేశ్‌లో మతమార్పిడులకు పాల్పడాలంటే ఒక నెలకు ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతూ బిల్‌ను పాస్ చేయడం అత్యంత దారుణమన్నారు. ఇదే తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో బిల్లును తీసుకొచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు అసదుద్దీన్. ఆలిండియా మజ్లిస్ -ఈ-ఇతెహాద్-ఉల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీచేసింది. ఆ సమయంలో ప్రకాష్ అంబేడ్కర్ పార్టీ భారిపా బహుజన్ మమాసంఘ్, వంచిత్ బహుజన్ అగాధీ పార్టీలతో కలిసి పోటీ చేసింది.

Congress story is finished,cannot revive even if calcium injection is given:Owaisi

వంచిత్ బహుజన్ అగాధీ పార్టీ ఔరంగాబాద్ లోక్‌సభ స్థానంను గెలుపొందింది.ఈ పార్టీ పోటీ చేయడంతో దళితులు, ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు చీలాయి. దీంతో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరిగింది.2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇక అక్టోబర్ 21న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాష్ అంబేడ్కర్‌కు చెందిన బీబీఎం పార్టీతో కలిసి పోటీ చేసేందుకు చర్చలు జరుపుతోంది. అయితే సీట్ల పంపకాల్లో రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి. ఇదిలా ఉంటే వీబీఏ పార్టీ మజ్లిస్‌తో కూడా చర్చలు చేయబోదు అని వస్తున్న వార్తలను ఖండించిన ప్రకాష్ అంబేడ్కర్... తాను చర్చలకు ఎప్పుడూ సిద్ధమే అని ప్రకటించారు.

English summary
The Congress party has been "wiped out" from the landscape and can't be revived even if it was administered a "calcium injection", said AIMIM leader Asaduddin Owaisi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X