వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సోనియా గాంధీ దూరం.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. దేశంలో మహిళలపై జరుగుతున్న, పెరిగిపోతున్న దాడులకు నిరసన ఈ ఏడాది జన్మదిన వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించుకొన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఇద్దరు మహిళల మరణాలు సోనియాను తీవ్రంగా కలిచి వేయగా, అందుకు నిరసనగా బర్తేడ్ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్నట్టు సమాచారం.. వివరాల్లోకి వెళితే..

 యూపీ ఉన్నావ్ ఘటన

యూపీ ఉన్నావ్ ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు సమీపంలోని ఉన్నావ్‌లో రేప్ బాధితురాలిని సజీవ దహనం చేయడంతో ఆమె చికిత్స పొందుతూ ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రం 11.40 గంటలకు జరిగిన ఘటనతో సోనియా తీవ్రంగా కలత చెందినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

హైదరాబాద్ దిశ దారుణంతో

హైదరాబాద్ దిశ దారుణంతో

ఇక తెలంగాణలో 26 ఏళ్ల మహిళా డాక్టర్ దిశ రేప్, హత్య అంశంతో సోనియా గాంధీ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైనట్టు సమాచారం. నవంబర్ 26 తేదీన శంషాబాద్‌కు సమీపంలోని ఛటాన్‌పల్లిలో జరిగిన ఈ దారుణంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ హత్యా నేపథ్యం కూడా సోనియా తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండేలా చేసిందని పార్టీ నేతలు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా మహిళలపై దాడులతో

దేశవ్యాప్తంగా మహిళలపై దాడులతో


ఇక ఈ రెండు ఘటనలే కాకుండా దేశవ్యాప్తంగా బీహార్‌లోని దర్భంగా, కేరళలోని కంజీరాపల్లి, ఒడిశా (కొరాపుట్), ఛత్తీస్‌గఢ్ (దుర్గ్), యూపీలోని బులంద్ షహర్ ఘటనలు కూడా కాంగ్రెస్ అధినేత్రిని మనస్తాపానికి గురిచేసిందనే విషయం పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇటీవల మహిళల జరిగిన సంఘటనలతో ఆందోళన చెందినట్టు తెలిసింది.

యూపీ సర్కార్‌పై ప్రియాంక నిప్పులు

యూపీ సర్కార్‌పై ప్రియాంక నిప్పులు

ఉన్నావ్ ఘటనపై కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీలో శాంతి భద్రతలు కరువయ్యాయని, మహిళలకు రక్షణ కరువైంది అని ప్రభుత్వంపై ప్రియాంక నిప్పులు చెరిగారు. గత కొద్దికాలంగా యూపీ సర్కార్ విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈశాన్య ఉత్తర ప్రదేశ్‌కు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Congress President Sonia Gandhi will not celebrate her birthday this year. Her Birthday happens on December 9. Reports suggest that As a protest against the rising rate of crime against women across the country, She wants away from the birthday celections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X