వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా ఆక్రమణలో కొన్ని వేల కిలోమీటర్ల భారత భూభాగం: ఒకరి తప్పులు ఒకరు: తవ్వి మరీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లఢక్ సెక్టార్‌లో భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు రోజురోజుకూ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అనేక వివాాదాలకు కేంద్రబిందువులు అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు. ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుతున్నారు. చైనా పట్ల బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మెతక వైఖరి అనుసరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తుతోండగా.. యూపీఏ హయాంలో చోటు చేసుకున్న తప్పులను తవ్వి మరీ వెలికి తీస్తోంది బీజేపీ.

పేదలందరికీ ఇళ్లు పథకానికి బడ్జెట్ రిలీజ్: దశలవారీగా: 8 జిల్లాలకు: ఏ జిల్లాకు ఎంతంటే..? పేదలందరికీ ఇళ్లు పథకానికి బడ్జెట్ రిలీజ్: దశలవారీగా: 8 జిల్లాలకు: ఏ జిల్లాకు ఎంతంటే..?

కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం చైనాకు ఏకంగా కొన్ని వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని అప్పనంగా అప్పగించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. చైనా పన్నిన వ్యూహంలో చిక్కుకున్న యూపీఏ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో వేల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా చేతిలో పెట్టిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా త్వరగా విస్మరించిందని ఎద్దేవా చేశారు. 2010-2013 మధ్యకాలంలో చైనా సైనికులు సరిహద్దులను దాటుకుని, భారత భూభాగాన్ని ఆక్రమించారని కౌంటర్ అటాక్ చేశారు.

Congress surrendered 43,000 sq km of Indian land to China: JP Nadda

.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను జేపీ నడ్డా తిప్పి కొట్టారు. దేశ భద్రతా దళాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, జవాన్ల మనో స్థైర్యాన్ని దెబ్బకొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్.. దేశ భద్రత గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. యూపీఏ హయాంలో చైనాతో పోరాడాకుండానే చేతులు ఎత్తేశారని, అప్పనంగా భారత భూభాగాన్ని అప్పగించారని ఆరోపించారు. చైనాతో అన్ని విషయాల్లోనూ రాజీపడ్డారనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయని చెప్పారు.

మన్మోహన్‌ సింగ్ ప్రధానిగా ఉన్న 2010-2013 మధ్య చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు 600 సార్లు భారత్‌ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చారని, వారిని ఎంతమాత్రం అడ్డుకున్నారని నడ్డా నిలదీశారు. లఢక్ సెక్టార్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటోందని, చైనాను నిలువరించడానికి అన్ని ప్రయత్నాలను చేస్తోందని నడ్డా చెప్పారు. ఇలాంటి సమయంలో కేంద్రానికి అండగా నిలవడానికి బదులుగా విమర్శలు గుప్పించడం సరికాదని హితవు పలికారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలను త్వరలోనే పరిష్కరించుకుంటామని అన్నారు.

English summary
BJP president JP Nadda on Monday hit out at the Congress saying that UPA government surrendered 43,000 Square kilometre of Indian land to China. He also alleged that Singh presided over 600 incursions made by China between 2010 to 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X