• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాటిదార్ల మద్దతు కోసం కాంగ్రెస్ పాట్లు: జాతి నిర్మాత కుటుంబ వారసుడు రాహుల్ అన్న హార్దిక్

By Swetha Basvababu
|

గాంధీనగర్: రెండేళ్ల క్రితం పాటిదార్ల రిజర్వేషన్ ఆందోళనతో వెలుగులోకి వచ్చిన హార్దిక్ పటేల్, దళితుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న జిగ్నేష్ మేవానీల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ తెర వెనుక యత్నాలు చేపట్టింది. 1998 నుంచి గుజరాత్ రాష్ట్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ.. రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చావో, రేవో అన్న రీతిలో పోరాడుతున్నది. ఈ నేపథ్యంలో మద్దతు కోసం హార్దిక్ పటేల్, జిగ్నేష్ మెవానీలతో కాంగ్రెస్ పార్టీ రాయబారాలు నడుపుతోంది.

గత జూలైలో రాజ్యసభ ఎన్నికల ముందు శంకర్ సింగ్ వాఘేలా సారథ్యంలో హిందుత్వ పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తూ పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అయితే పాటిదార్లకు రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్, ఓబీసీల హక్కుల పరిరక్షణ కోసం అల్పోక్ ఠాకూర్, దళితులపై దాడులను నిరసిస్తూ జిగ్నేశ్ మేవానీ సారథ్యంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రచారం రాష్ట్రంలోని అధికార బీజేపీకి గుదిబండగా మారాయన్న విమర్శలు ఉన్నాయి.

 హార్దిక్, జిగ్నేశ్‌లతో సంప్రదిస్తున్నట్లు వెల్లడి

హార్దిక్, జిగ్నేశ్‌లతో సంప్రదిస్తున్నట్లు వెల్లడి

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అత్యంత సన్నిహితురాలైన సామాజిక, మానవ హక్కుల కార్యకర్త షబ్నం హస్మీ మాట్లాడుతూ హార్దిక్ పటేల్‌తో సంప్రదిస్తున్న ధ్రువీకరించారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్ మద్దతునిస్తారా? లేదా? అనే విషయం ఇప్పటికిప్పుడు చెప్పలేమన్నారు. ఒకవేళ ఆయన మద్దతు తెలిపితే కాంగ్రెస్ పార్టీకి భారీగా లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్ మద్దతు తెలిపితే బీజేపీకి లభించే ఓట్లకు గండి పడుతుందని అంచనా వేస్తున్నారు. పటేళ్లు ఏనాడు పాతకాలం నాటి పార్టీకి మద్దతు తెలపలేదు. కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ కూడా పాటిదార్ల మద్దతు కోసం తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నది. హార్దిక్ పటేల్ తమకు మద్దతు తెలిపినా, తమతో కలిసి పని చేసినా చాలా తేడాతో కూడిన ఫలితాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. బలమైన శక్తిగా ఎదుగుతామని ఆ వర్గాలు చెప్పాయి.

జిగ్నేశ్ మేవానీతోనూ హస్తం పార్టీ నేతల చర్చలు

జిగ్నేశ్ మేవానీతోనూ హస్తం పార్టీ నేతల చర్చలు

మరోవైపు దళితులపై హింసాత్మక దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న దళితుల హక్కుల పోరాట నాయకుడు జిగ్నేశ్ మేవానీతోనూ కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుపుతున్నట్లు ధ్రువీకరించారు. నిరంతరం కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నామని, స్పందన సానుకూలంగా ఉన్నదని ఆ వర్గాలు తెలిపాయి. జిగ్నేశ్ మేవానీతో జరుపుతున్న చర్యలు ఫలప్రదం అవుతాయని ఆ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది ఉనాలో దళితులపై దాడికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన ముందు ఉన్నారు. దళితులపై దాడులు, అక్రుత్యాలకు నిరసనగా గాంధీనగర్‌లో సచివాలయం ముందు ఆందోళన చేసినందుకు జిగ్నేశ్ మేవానీని పోలీసులు అరెస్ట్ చేశారు. మేవానీ ఆందోళనలు పెరిగితే, తమకు మద్దతునిస్తే ‘శాంతిభద్రతల సమస్య'ను ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ముఖ్యమైన దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తూ మెజారిటీ సామాజిక వర్గాలకు తాము అనుకూలమన్న సంకేతాలు పంపింది. ఇదంతా చాలా నిశ్శబ్దంగా సాగుతున్నదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

 భావ సారూప్య సంస్థలతో అవగాహనకు రెడీ

భావ సారూప్య సంస్థలతో అవగాహనకు రెడీ

రెండు నెలల్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తన ప్రథమ ప్రాథమ్యాల్లో ఒకటని పాటిదార్ల హక్కుల పోరాట సమితి నాయకుడు హార్దిక్ పటేల్ పేర్కొన్నారు. భావ సారుప్య సంస్థలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటామని ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో నవ్ సర్జన్ యాత్రలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి హార్దిక్ పటేల్ స్వాగతం పలుకడంతోపాటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నదన్న సంకేతాలిచ్చారు.

 రాహుల్ మంచి రాజకీయ నాయకుడని ప్రశంసలు

రాహుల్ మంచి రాజకీయ నాయకుడని ప్రశంసలు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గుజరాత్ లోని ద్వారకాదీశ్ ఆలయాన్ని సందర్శించారని, ఒక రాష్ట్ర పౌరుడిగా స్వాగతించానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అర్హత లేదని, అయినా రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి.. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో నిరాశానిస్ప్రుహలతో ఉన్న పాటిదార్లు, ఇతర సామాజిక వర్గాలకు మెరుగైన పరిస్థితుల కోసం ఏదో ఒకటి చేయాలని ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ సరైన రాజకీయ నాయకుడేనని, కానీ మీడియా ఆయన్ను తక్కువ చేసి చూస్తున్నదని అన్నారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుల, జాతి నిర్మాతల కుటుంబం నుంచి వచ్చారన్న సంగతి విస్మరించరాదని, ఆయనను గౌరవించాలని హార్దిక్ పటేల్ సూచించారు.

ప్రభుత్వం కేసులు ఉపసంహరించినా వైఖరి మారదని స్పష్టీకరణ

ప్రభుత్వం కేసులు ఉపసంహరించినా వైఖరి మారదని స్పష్టీకరణ

తాము విజయ్ రూపానీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని హార్దిక్ పటేల్ ఆరోపించారు. పాటిదార్ల ప్రతినిధిగా తాను సీఎంను కలుసుకున్నానని పేర్కొన్నారు. కానీ బీజేపీ దీన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం పాటిదార్లను విభజించేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. పాటిదార్ల రిజర్వేషన్ల పోరాట సమితి ఆందోళనలో పాల్గొన్న పటేళ్ల యువతపై నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తే మంచిదేనన్నారు. కానీ తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదని హార్దిక్ పటేల్ తేల్చి చెప్పారు. తనపై, తన మద్దతుదారులపై పలు తప్పుడు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

 జిగ్నేశ్ మేవానీతో కలిసి పనిచేస్తామన్న హార్దిక్

జిగ్నేశ్ మేవానీతో కలిసి పనిచేస్తామన్న హార్దిక్

కేవలం పాటిదార్లు మాత్రమే కాదని, ఇతర సామాజిక వర్గాల వారు బీజేపీ ప్రభుత్వం హయాంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని హార్దిక్ ఆందోళన వ్యక్తం చేశారు. పాటిదార్లు నిర్వహించిన ర్యాలీల్లో ముస్లింలు, దళితులు పాల్గొనడమే దీనికి కారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల యువతలో పట్టుదల ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో తాను తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని హార్దిక్ పటేల్ చెప్పారు. దళిత కార్యకర్త జిగ్నేశ్ మేవానీతోనూ కలిసి తాము పని చేస్తున్నామని, తమ లక్ష్యాలు ఒక్కటేనని, వాటి సాధన దిశగా ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. తాము చేతులు కలిపేందుకు అవకాశాలు ఉన్నాయని హార్దిక్ పటేల్ తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Congress has started back-channel talks with both Hardik Patel, the face of the Patidar reservation agitation, and Dalit leader Jignesh Mewani in poll bound Gujarat, where the grand old party may be locked in a two-way contest with the BJP, which has been ruling the coastal state since 1998.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more