వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్యాగం సరే .. దేశాన్ని విభజించిందెవరు ? కశ్మీర్ సమస్యకు కారణమెవరు, లోక్‌సభలో అమిత్ షా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ పార్టీ మేం త్యాగాలు చేశామని గొప్పలు చెప్తుంది. అయితే దేశాన్ని విభజించింది ఎవరు ? ప్రశ్నించారు. కశ్మీర్ సమస్యకు కారకులెవరు అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే దేశ విభజన జరగలేదా ? అని తనదైనశైలిలో విపక్ష పార్టీని ఏకీపారేశారు. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. తర్వాత లోక్‌సభలో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు.

విభజన పాపం మీదే ..

విభజన పాపం మీదే ..

భారతదేశాన్ని విభజించింది ఎవరు అని ప్రశ్నించారు అమిత్ షా. అప్పటి కాంగ్రెస్ పార్టీ కాదా అని కొశ్చన్ చేశారు. తరచూ ఆ పార్టీ నేతలు మేం త్యాగాలు చేశాం. దేశం కోసం ప్రాణాలర్పించామని చెప్తున్నారు. కానీ మందు నాదో ప్రశ్న మీది నిజమైన దేశభక్తి అయితే .. దేశాన్ని ఎందుకు విభజించారో చెప్పాలని డిమాండ్ చేశారు. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా లోక్‌సభలో అమిత్ షా మాట్లాడుతుండగా పదే .. పదే కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. దీంతో కాంగ్రెస్ నేత మనీశ్ తివారీని ఉద్దేశించి ... ఈ దేశాన్ని విభజించింది ఎవరు ? ఇది చారిత్రక తప్పిదం కాదా ? జమ్ము కశ్మీర్‌లోని మూడోవంతు భూభాగం భారత్‌తో లేకపోవడానిిక కారణమెవరు ? అని ప్రశ్నలు సంధించారు. ఒకవేళ తాము అధికారంలో ఉండి ఉంటే ఇలాంటి తప్పులు చేసేవారం కాదు అని తేల్చిచెప్పారు.

తప్పుల తడక ..

తప్పుల తడక ..

స్వాతంత్ర్యం రాకముందు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పదాలే ఇప్పుడు శాపంగా మారాయని గుర్తుచేశారు. దేశాన్ని విభజించే సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ కనీసం డిప్యూటి ప్రధాని, హోంమంత్రి అభిప్రాయం కూడా తీసుకోలేదు అని మండిపడ్డారు. కానీ తర్వాత సర్దార్ వల్లభాయి పటేల్ వల్లే హైదరాబాద్, జునాగఢ్ రాజ్యాలు భారతదేశంలో కలిసిపోయానని చెప్పారు. చరిత్రలో జరిగిన అంశాలకు సంబంధించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది మీరు చేసిన తప్పిదమని .. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తుండగా అమిత్ షా వివరించారు.

ఇదేం వాదన ..

ఇదేం వాదన ..

కానీ విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ మేం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నామని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే కశ్మీర్‌లో 132 సార్లు 356 ఆర్టికల్ విధించామని (రాష్ట్రపతి పాలన) గుర్తుచేశారు. అయితే ఇందులో 93 సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పాలన విధించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కానీ వీరు మాకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎన్డీఏ హయాంలో ఉగ్రవాదుల చర్యలు పెరిగాయని అంటే .. జమాతే ఈ ఇస్లామీని నిషేధించింది ఎవరు ? మేం కాదా అని ప్రశ్నించారు. ఆ పని మీ హయాంలో ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. అలాగే జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌ను నిషేధించింది ఎవరు అని నిలదీశారు.

English summary
Union Home Minister Amit Shah again lambasted the Congress leadership while speaking at the Lok Sabha on Friday. Attacking the Congress, Shah said that the party divided India. "Congress keeps talking about sacrifice but let me ask who divided the country first," Shah said, referring to the partition of India. Amid a huge uproar by Congress leaders, Amit Shah went on to ask, "Manishji (Manish Tewari), who partitioned the country? It was a monumental blunder. We didn't do it. One-third of Jammu and Kashmir is not with us. Because of whom?"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X