వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌పీఆర్ వర్సెస్ ఎన్‌ఆర్‌యూ: జాతీయ నిరుద్యోగ రిజిష్టర్‌లో 5 లక్షలకు పైగా మంది నమోదు..

|
Google Oneindia TeluguNews

జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్)తో పౌరుల జాబితా రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్టర్ నేపథ్యంలో ఎన్‌పీఆర్‌పై కూడా సందేహాలు తలెత్తాయి. అయితే దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ జాతీయ నిరుద్యోగ రిజిష్టర్ పేరుతో జాబితా రూపొందిస్తోంది. దీంతో నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టంచేసింది.

జన ఆక్రోశ్ ర్యాలీలో..

జన ఆక్రోశ్ ర్యాలీలో..

ఇటీవల జైపూర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ‘జన్ ఆక్రోశ్ ర్యాలీ' నిర్వహించారు. ఈ సమయంలోనే జాతీయ నిరుద్యోగిత రిజిష్టర్ పేరుతో నిరుద్యోగుల జాబితా రూపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 8151994411 టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి నమోదు చేసుకోవాలని పిలుపునివ్వగా భారీ సంఖ్యలో యువత స్పందించారు. అక్కడ బ్యానర్‌ను రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. తర్వాత నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో నిరుద్యోగుల జాబితా రూపొందుతోంది. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు వివరించారు. ఇందులో ఒక్క రాజస్థాన్ నుంచే 58 వేల మందికి పైగా ఉండటం విశేషం. రాజస్థాన్ తర్వాతే మిగతా రాష్ట్రాలు నిలిచాయి.

డిగ్రీలు ఉన్నాయి.. నౌకరీ లేదు

డిగ్రీలు ఉన్నాయి.. నౌకరీ లేదు


కేంద్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్ఆర్సీ కాకుండా జాతీయ నిరుద్యోగిత జాబితా రూపొందిస్తే బాగుంటుందని సూచించారు. జన్ ఆక్రోశ్ ర్యాలీలో తమకు డిగ్రీలు ఉన్నాయి.. కానీ ఉద్యోగం లేదు, మా ఉద్యోగం ఎక్కడ..? ఉద్యోగం కావాలి, హామీలు కాదు అనే నినాదాలు చేశారు. రాహుల్ గాంధీతోపాటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు.

నమోదు చేసకొండి

నమోదు చేసకొండి

జాతీయ నిరుద్యోగ యువత రిజిష్టర్‌ను మరింత విసృతం పరుస్తామని యూత్ కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ప్రతీ ఒక్క నిరుద్యోగి నమోదు చేసుకోవాలని కోరారు. జాబితాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు తీసుకెళతామని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగిత సమస్య ఉన్న. కేంద్రం మాత్రం సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్ఆర్సీ ప్రవేశపెట్టి దేశాన్ని విచ్చినం చేయాలని చూస్తోందని రాజస్థాన్ మంత్రి అశోక్ చందా పేర్కొన్నారు.

రాజస్థాన్‌లో ఏదీ...?

రాజస్థాన్‌లో ఏదీ...?

కాంగ్రెస్ జాబితాపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగ కల్పనాలు ఏమయ్యాయని అడిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానంపై దృష్టిసారించాలని కోరారు. అది మరచి తమపై విమర్శలు చేయడం సరికాదని బీజేపీ అధికార ప్రతినిధి ముఖేశ్ ఫరీక్ పేర్కొన్నారు.

English summary
banner painted with the words ‘National Register of Unemployment’ was launched at Congress MP Rahul Gandhi in jaipur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X