వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోర్ బరిలో కాంగ్రెస్ తరపున బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..?

|
Google Oneindia TeluguNews

ఇండోర్: ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ప్రచార వేడి పెరుగుతోంది. తమ పార్టీ విజయం కోసం అన్ని దార్లను వినియోగించుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. ఇటు జాతీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు తమ కోసం ప్రచారం చేయాల్సిందిగా అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఇక తాజాగా లోక్‌సభ ఎన్నికలు వస్తుండటంతో అభ్యర్థులు సినీ గ్లామర్‌ను నమ్ముకుంటున్నారు. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ బాలీవుడ్ సూపర్ స్టార్‌ను ప్రచారంలోకి దింపే ప్రయత్నాలు చేస్తోంది.

ఎన్నికలవేళ తెరపైకి రాజీవ్ గాంధీ హత్య కేసు: ఆ రెండు పార్టీలు ఏమి చెబుతున్నాయి..?ఎన్నికలవేళ తెరపైకి రాజీవ్ గాంధీ హత్య కేసు: ఆ రెండు పార్టీలు ఏమి చెబుతున్నాయి..?

ఇండోర్‌లో సల్మాన్ ఖాన్..?

ఇండోర్‌లో సల్మాన్ ఖాన్..?

గతేడాది డిసెంబరులో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అదే ఊపుతో లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేయాల్సిందిగా జాతీయ నేతలతో పాటు బాలీవుడ్ స్టార్లను ప్రచారం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కోరుతున్నారు. ఇందులో భాగంగానే ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని ఇండోర్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ను ప్రచారంలోకి దింపేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇప్పటికే సల్మాన్‌తో సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్

ఇప్పటికే సల్మాన్‌తో సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్

సల్మాన్‌ఖాన్ 1965 ఇండోర్‌లోని పలాసియా ప్రాంతంలో జన్మించాడు. సల్మాన్ తాత ఓ పోలీసు అధికారిగా ఇండోర్ లో పనిచేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది చెప్పారు. తన సగ బాల్యం ఇండోర్‌లోనే గడిపాడని చెప్పిన పంకజ్ ఆ తర్వాత ముంబైకి వెళ్లాడు అని వెల్లడించారు. సల్మాన్‌ ఖాన్‌ ప్రచారం చేయాల్సిందిగా ఇప్పటికే తమ నాయకులు కోరారని తప్పకుండా ఈ బాలీవుడ్ కండల వీరుడు తమ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే సల్మాన్ ఖాన్ తరపున ప్రతినిధి ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించాడు.

1989 నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న స్పీకర్ సుమిత్రా మహాజన్

1989 నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న స్పీకర్ సుమిత్రా మహాజన్

ఇక సల్మాన్‌ఖాన్‌కు ప్రజల్లో చాలా క్రేజ్ ఉంది. అందుకే కాంగ్రెస్ సల్మాన్‌ ఖాన్‌తో ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఇండోర్‌లో ప్రచారం చేయించి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపులో భాగస్వామి కావాలని సల్మాన్‌ను కోరినట్లు సమచారం. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ అతిపెద్ద నగరం. ఇప్పటి వరకు ఇండోర్‌ బీజేపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. 1989లో ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రకాష్ చంద్ర సేథీపై విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి ఇండోర్ కాషాయం కంచుకోటగా నిలుస్తోంది. ఇక అప్పటి నుంచి మహాజన్ ఆ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఆ లోక్‌సభ స్థానం నుంచి 8 సార్లు ఎంపీ అయ్యారు. 2009లో మేయర్ కోసం జరిగిన ఎన్నికల్లో ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ సంఘ్వీ తరపున సల్మాన్ ఖాన్ ప్రచారం చేశారు. సల్మాన్ ప్రచారం చేసినప్పటికీ అక్కడ ఫలితం రాలేదు. బీజేపీ సీనియర్ నేత మురారీ మోగే గెలిచారు.

ఈ సారి సల్మాన్ ఖాన్ ప్రచారం చేస్తే బీజేపీ కంచుకోటగా ఉన్న ఇండోర్‌లో కాంగ్రెస్ ది పైచేయి అవుతుందో లేదో అనేది చూడాలి.

English summary
The Madhya Pradesh Congress is trying to get Bollywood star Salman Khan to campaign for it in Madhya Pradesh's commercial capital Indore, a party leader said.The actor was born in Indore's Palasia area in 1965 and spent a substantial part of his childhood in that city before moving to Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X