వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిస్టుగా చూపించాలని చూస్తోంది: కాంగ్రెస్‌పై రామ్‌దేవ్

By Pratap
|
Google Oneindia TeluguNews

 Baba Ramdev
ఇండోర్: యుపిఎ ప్రభుత్వంపై, ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై యోగా గురు బాబా రామ్‌దేవ్ తీవ్రంగా మండిపడ్డారు. సిబిఐ నుంచి స్థానిక పోలీసుల వరకు అన్ని సంస్థలను ఉపయోగించి తనను నేరస్థుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. నల్లధనానికి, కుంభకోణాలకు వ్యతిరేకంగా తాను చేపట్టిన ప్రచారం ద్వారా పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెసు పార్టీ తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం కోసం తాను ప్రార్థనలు చేస్తానని, వచ్చే ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయకపోవచ్చునని, దాంతో అనివార్యంగా రాహుల్ గాంధీని దూకుడుగా ముందుకు తెస్తోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు తనను టెర్రరిస్టుగా చూపించే ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు.

రాహుల్ గాంధీకి చరిష్మా లేదని, నాయకత్వ లక్షణాలు లేవని, దానివల్ల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు వంద సీట్లు కూడా రావని, ఈ స్థితిలో పార్టీని రాహుల్ గాంధీ ఐక్యంగా ఉంచలేరని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెసు పార్టీని రద్దు చేయాలనే మహాత్మా గాంధీ కలను రాహుల్ గాంధీ నెరవేరుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ కన్నా ఎక్కువ చరిష్మా ప్రియాంక గాంధీకి ఉందని, అయితే మగపిల్లలపై ఉండే ప్రేమ కొద్ది సోనియా రాహుల్ గాంధీని ఎంపిక చేసుకున్నారని ఆయన అన్నారు. రాహుల్‌కు గాంధీ అనేది ఉందని, అయితే మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని రాహుల్ ఆచరించడం లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ అమాయకుడని, స్వార్థ ప్రయోజనాలు గల నాయకుల గుంపు రాహుల్‌ను ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకు చరిష్మాతో కూడిన వ్యక్తిత్వం, మాస్ అపీల్ ఉన్నాయని, ప్రజలు మోడీ ప్రసంగాలను వినడానికి ఉత్సాహం ప్రదర్శిస్తారని ఆయన అన్నారు.

English summary
Yoga guru Baba Ramdev on Tuesday attacked the UPA government and the Uttarakhand government for using all its agencies, from the CBI to the local police, to project him as a criminal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X